Home Latest News Hanmakonda | లేడీస్‌ హాస్టల్‌లో అర్ధరాత్రి దొంగతనం చేసి బావిలో పడ్డ దొంగ.. తెల్లారి బయటకుతీస్తే...

Hanmakonda | లేడీస్‌ హాస్టల్‌లో అర్ధరాత్రి దొంగతనం చేసి బావిలో పడ్డ దొంగ.. తెల్లారి బయటకుతీస్తే అసలు విషయం తెలిసింది!

Image Source: Pixabay

Hanmakonda | ఈ దొంగను చూస్తే …” అనుకున్నది ఒకటి… అయినది ఒకటి.. బోల్తా కొట్టిందిలే..” అనే పాట గుర్తుకు వస్తుంది. ఎందుకంటే.. చక్కగా లేడీస్‌ హాస్టల్లో దూరాడు. ఓ ల్యాప్‌ టాప్‌, ఓ 14 సెల్‌ఫోన్లు కొట్టేశాడు. దర్జాగా హాస్టల్‌ నుంచి బయటకు వచ్చాడు. చిమ్మ చీకటిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఓ బావిలో పడ్డాడు. అసలే అర్థరాత్రి.. అరిచినా ఎవరికి వినిపించలేదు. దీంతో చేసేదేం లేక తెల్లారేదాక బావిలోనే ఉండిపోయాడు. ఉదయం జనం అలికిడి విని పెద్దగా అరుపులు వేయడంతో అటుగా వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. తాళ్ల సాయంతో అతన్ని పోలీసులు బయటకు తీశారు. అయితే అతని వద్ద ఉన్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌ చూసిన పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నిస్తే అసలు విషయం తెలిసి షాక్‌ అయ్యారు.

హన్మకొండ జిల్లా ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్ కాలేజ్‌లోని గర్ల్స్‌ హాస్టల్లో అర్ధరాత్రి సమయంలో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు దొంగతనం చేశాడు. తిరిగి వస్తుండగా దారిలో ప్రమాదవ శాత్తు బావిలో పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం అతని కేకలు విన్న స్థానికులు పోలీసులను అప్రమత్తం చేశారు. వారు తాడు సహాయంతో అతడిని బయటకు తీశారు. అతని దగ్గరున్న గాడ్జెట్‌ చూసిన పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో హాస్టల్‌లో నాలుగు సెల్‌ ఫోన్‌లు, ల్యాప్‌ టాప్‌లు దొంగిలించి తప్పించుకునే క్రమంలో బావిలో పడ్డానని ఆ వ్యక్తి అంగీకరించాడు. పోలీసులు మరింత లోతుగా విచారణ చేయగా.. మూడు రోజుల్లో 14 సెల్‌ ఫోన్లు, ఆరు ల్యాప్‌ టాప్‌లు చోరీకి గురైనట్లు విచారణలో తేలింది. ఇలా చోరీలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవడం లేదని, తమకు సరైన భద్రత కల్పించడం లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Smith Sabharwal | తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి ఇంట్లోకి అర్థరాత్రి ప్రవేశించిన వ్యక్తి ఎవరు.. దాని గురించి ఆమె ఏమన్నారు!

Singer Mangli | సింగర్ మంగ్లీ కారుపై బళ్లారిలో రాళ్ల దాడి.. దాడికి కారణం అదేనా!

Breaking News | హైదరాబాద్‌లో హత్య కేసులో సంచలన విషయాలు.. సోదరితో ప్రేమ వివాహమే హత్యకు కారణమన్న పోలీసులు

Breaking News | హైదరాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. స్పందించని స్థానికులు

Che guevara | హైదరాబాద్‌కు చే గువేరా కుమార్తె, మనవరాలు.. రవీంద్ర భారతి క్యూబా సంఘీభావ సభలో పాల్గొననున్న శ్రీనివాస్ గౌడ్, రేవంత్ రెడ్డి

KTR | ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన.. వామ్మో తెలంగాణకు అన్ని కోట్ల పెట్టుబడులా?

Exit mobile version