Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsTSPSC Group-1 Results | గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఎంపికైన...

TSPSC Group-1 Results | గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఎంపికైన వాళ్ల జాబితా ఇదే

TSPSC Group-1 Results | ఎట్టకేలకు తెలంగాణ గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 1:50 నిష్పత్తి ద్వారా 25,050 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది. ఈ జాబితాను టీఎస్‌పీఎస్సీ తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. జూన్‌లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను జనవరి 18న టీఎస్‌పీఎస్సీ వెల్లడించనుంది.

మొత్తంగా 503 పోస్టుల కోసం అక్టోబర్‌ 16 గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించింది. ఈ పోస్టలు కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2,85,916 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే ఫలితాలను వెల్లడించే సమయంలో ఓ అభ్యర్థి కోర్టును ఆశ్రయించింది. 11 ఏళ్ల పాటు తెలంగాణలో చదివినప్పటికీ తనను స్థానిక అభ్యర్థిగా గుర్తించడం లేదని.. నాన్‌ లోకల్‌గా గుర్తించారంటూ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన పి.నిహారిక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై తాజాగా విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి ధర్మాసనం.. ఆ అభ్యర్థిని స్థానిక కోటా అభ్యర్థిగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై టీఎస్‌పీఎస్సీ కూడా అప్పీలు దాఖలు చేసింది. టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రస్తుతానికి గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేయవచ్చని సూచించింది. అభ్యర్థి స్థానికతపై తర్వాత విచారణ జరుపుతామని పేర్కొంది. దీంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ఫలితాలను విడుదల చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

SI Exams Schedule | ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్ష తేదీల్లో మార్పులు… ప్రకటించిన రిక్రూట్‌మెంట్ బోర్డు!!

Kanti Velugu | తెలంగాణలో కంటి వెలుగుకు ఆధార్ తప్పని సరి.. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

TSRTC MD Sajjanar | సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నారా? కార్లెందుకు.. బస్సులో వెళ్లండి: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Ganga vilas | ప్రధాని మోదీ ప్రారంభించిన గంగా విలాస్ ఎక్కాలంటే 20 లక్షలు ఉండాల్సిందే.. ఈ క్రూయిజ్ స్పెషాలిటీ ఏంటి?

Roja Selvamani | ఆ ఒక్క మాటతో శ్రీకాకుళం జనం జేబులో చేతులు పెట్టుకుని వెళ్లిపోయారు.. పవన్ కళ్యాణ్‌పై రోజా సెటైర్లు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News