Home Latest News CM KCR | కొండగట్టుపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు.. మరో 500 కోట్లు కేటాయింపు

CM KCR | కొండగట్టుపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు.. మరో 500 కోట్లు కేటాయింపు

CM KCR | జగిత్యాల జిల్లా కొండగట్టు పర్యటనలో భాగంగా అంజన్న ఆలయానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ వరాల జల్లులు కురిపించారు. ఇప్పటికే కొండగట్టు క్షేత్ర అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.100 కోట్ల నిధులు కేటాయించగా.. తాజాగా మరో రూ.500 కోట్లు కేటాయిస్తున్నానని ప్రకటించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా కొండగట్టు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. ఆ ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేశారు. అనంతరం జేఎన్టీయూ కాలేజీ నుంచి ప్రత్యేక బస్సులో ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్‌కు ఆలయపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

దేశంలోనే అతిపెద్ద హనుమాన్‌ ఆలయం.. కొండగట్టు

దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కొండగట్టు క్షేత్రానికి వచ్చిన కేసీఆర్‌.. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వమించారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద హనుమాన్‌ క్షేత్రం ఎక్కడ ఉందని అడిగితే కొండగట్టు పేరు చెప్పుకోవాలని అన్నారు. దీనికోసం సుమారు 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. భక్తులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు సకల హంగులతో అభివృద్ధి చేయాలని అన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా ఘాట్‌ రోడ్లను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

86 ఎకరాల్లో సువిశాల పార్కింగ్‌

CM KCR visits Kondagattu Anjaneya Swamy Temple
CM KCR visits Kondagattu Anjaneya Swamy Temple

దేశంలోనే అత్యంత గొప్పగా హనుమాన్‌ జయంతి వేడుకలు కొండగట్టులో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వేలాది మంది భక్తులు హనుమాన్‌ దీక్ష ధారణ, విరమణ చేస్తుంటారని అన్నారు. వాళ్లందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇందుకోసం 850 ఎకరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. పెద్ద గోడ, పార్కింగ్‌, పుష్కరిణి, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట ఏర్పాటు చేయాలని అన్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 86 ఎకరాల్లో సువిశాలమైన పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేయాలని సూచించారు. వీటన్నింటి కోసం ముందుగా బడ్జెట్‌లో కేటాయించిన రూ.100 కోట్లు సరిపోవని.. మరో రూ.500 కోట్లను అదనంగా ఆలయ అభివద్ధికి ప్రకటించారు. మళ్లీ కొండగట్టు వచ్చి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.

CM KCR visits Kondagattu Anjaneya Swamy Temple

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Megastar Chiranjeevi | చిరంజీవి గందరగోళం.. ఇలాగైతే ఎలా మెగాస్టార్ గారూ..?

Train Accident | మేడ్చల్ జిల్లాలో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

KCR on Etela Rajender | ఈటల తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారా.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏమన్నారు.. ఈటల రియాక్షన్‌ ఏంటి?

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్

Telangana Secretariat | తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

Exit mobile version