Home Latest News World Economic Forum 2023 | దావోస్‌ వేదికగా తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థలు...

World Economic Forum 2023 | దావోస్‌ వేదికగా తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థలు ఇవే!

World Economic Forum 2023 | దావోస్‌ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వ బృందం పెట్టుబడులు పెట్టడానికి వేట మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే తెలంగాణ పెవిలియన్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా కొందరు వ్యాపార వేత్తలు, దిగ్గజాలు, సీఈవోలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఆ క్రమంలోనే పెప్సికోతో పాటు మరో 2 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ముందుకొచ్చాయి.

తెలంగాణలో తన కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్లు పెప్సికో ప్రకటించింది. ఆ సంస్థ ఉపాధ్యక్షులు రాబర్డో అజేవేడో ప్రకటించారు. ఒక సంవత్సర కాలంలో అదనపు ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు సంస్థ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తామని పేర్కొన్నారు.

గ్లోబల్ బిజినెస్‌ సర్వీస్ సెంటర్‌ విస్తరణతో పాటు రాష్ట్రంలో పెప్సికో ఇతర విభాగాల విస్తరణ అవకాశాలపైన కేటీఆర్ రాబర్డో చర్చించుకున్నారు. పెప్సికో నిర్ణయం పై మంత్రి హర్షాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన విస్తరణ ప్రణాళికలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

2019లో 250 మందితో ప్రారంభమైన గ్లోబల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ సెంటర్‌లో ప్రస్తుతం 2800 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు రాబర్డో తెలిపారు. ఈ సంఖ్యను నాలుగు వేలకు పెంచనున్నట్లు చెప్పారు.

మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్‌ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రముఖ బ్యాటరీల సంస్థ అలాక్స్‌ ముందుకొచ్చింది. దీనిని 750 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్ ప్రకటించింది. లండన్ తరువాత తమ రెండో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Electric bike | ఇంటివద్దే ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసిన కరీంనగర్‌ కుర్రాడు.. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 180 కి.మీ ప్రయాణించొచ్చట

Electric Car Eva | కిలో మీటర్‌కు 80 పైసలే ఖర్చు.. అదిరిపోయే ఫీచర్‌తో వస్తున్న సరికొత్త కారు

maruti suzuki | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

flying bike | గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేస్తోంది.. ఇప్పుడే బుకింగ్‌ చేసుకోండి

Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

Exit mobile version