Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsKamareddy Master Plan | అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది.. కామారెడ్డి...

Kamareddy Master Plan | అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Kamareddy Master Plan | టైం2న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ల విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని అభిప్రాయ పడింది. ఇప్పుడు కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ కాదని హైకోర్టు పేర్కొంది. అనుకున్నవి అనుకున్నట్ల జరిగితే ఈ దేశం ఎప్పుడో బాగుపడేదంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమను సంప్రదించకుండా పంట భూములను రిక్రియేషన్ జోన్‌గా ప్రతిపాదించడాన్ని సవాలు చేస్తూ రామేశ్వర్ పల్లి రైతులు హైకోర్టు మెట్లెక్కారు. తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్‌ను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం మాస్టర్ ప్లాన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అనంతరం తదుపరి విచారణను ఈనెల 25కి హైకోర్టు వాయిదా వేసింది.

మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వ్యతిరేకిస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రైతుల ఆందోళనకు బీజేపీ నేత వెంకట రమణారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, వైఎస్ఆర్‌టీపీ నేతలు మద్దతు తెలిపారు. ముసాయిదా ప్లాన్‌ను రద్దు చేయాలంటూ రైతులు తెలిపిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

Youtube shorts | యూట్యూబ్‌లో షార్ట్స్‌ చేసేవారికి గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే లక్షలు సంపాదించవచ్చట

IRCTC Train Ticket | జర్నీలోనే మీ స్లీపర్‌ టికెట్‌ను ఏసీ కోచ్‌లోకి మార్చుకోవాలా? ఇలా చేస్తే సరి !!

Inavolu Mallanna Jatara | తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే జాతర ఐనవోలు.. దీని విశిష్ఠత ఏంటి? అన్నిటికంటే ఈ జాతర ఎందుకు ప్రత్యేకం?

Nabha Natesh | నభా నటేశ్‌కు యాక్సిడెంట్‌.. పలు సర్జరీలతో కోలుకున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News