Thursday, April 25, 2024
- Advertisment -
HomeNewsInternationalIshan Kishan | ఇసాన్ కిషన్ రికార్డు డబుల్ సెంచరీ

Ishan Kishan | ఇసాన్ కిషన్ రికార్డు డబుల్ సెంచరీ

Ishan Kishan | పురుషుల వన్డే క్రికెట్లో ఇషాన్ క్రికెట్ రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇషాన్ చరిత్ర తిరగరాశాడు. బంగ్లాదేశ్తో శనివారం జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఈ ఘనత సాధించాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 126 బంతుల్లోనే అతను డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఇందులో 23 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన రికార్డు గతంలో వెస్టిండీస్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 138 బంతుల్లో 200 పరుగులు చేశాడు.


ఇషాన్ కిషన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ద్విశతకాన్ని సాధించిన ఏడో బ్యాట్స్మన్ కాగా, భారత్ నుంచి ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాట్స్మన్. ఇషాన్ కంటే ముందు భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ ఈ ఘనత సాధించారు. రోహిత్ శర్మ ఖాతాలో మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా వన్డే క్రికెట్లో 9 డబుల్ సెంచరీలు నమోదు కాగా ఇందులో 6 భారత క్రీడాకారులు చేసినవే.


క్రిస్ గేల్ (వెస్టిండీస్), ఫఖార్ జమాన్ (పాకిస్తాన్), మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) కూడా తలో డబుల్ సెంచరీ సాధించారు.


ఈ మ్యాచ్లో వేగంగా ద్విశతకాన్ని పూర్తి చేయడమే కాకుండా, భారత్ తరఫున వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ఇషాన్ రికార్డు నెలకొల్పాడు. అతను 103 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. అంతకంటే ముందు ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ ఖాతాలో ఉండేది. 2011లో వెస్టిండీస్తో వన్డే మ్యాచ్లో సెహ్వాగ్ 112 బంతుల్లో 150 పరుగులు సాధించాడు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే చట్టోగ్రామ్లో జరుగుతోన్న మూడో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (210) పరుగులు చేయగా, విరాట్ కోహ్లి తన కెరీర్లో 72వ సెంచరీని సాధించాడు. కోహ్లి 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. వన్డేల్లో చివరిసారిగా 2019 ఆగస్టులో సెంచరీ నమోదు చేసిన కోహ్లి దాదాపు మూడేళ్ల తర్వాత మరో సెంచరీ సాధించగలిగాడు. కోహ్లికి ఇది 44వ వన్డే సెంచరీ. వాషింగ్టన్ సుందర్ (37), అక్షర్ పటేల్ (20) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో టస్కీన్ అహ్మద్, ఇబాదత్ హొస్సేన్, షకీబుల్ హసన్ తలా 2 వికెట్లు తీశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

FIFA World cup 2022 | మెస్సీ మెరుపులు.. సెమీస్‌కు చేరిన అర్జెంటీనా

FIFA world cup | ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో సంచలనం.. బ్రెజిల్‌ను ఓడించిన క్రొయేషియా

Cricket records | ఆరంగేట్రంలోనే అదుర్స్‌ అనిపించిన పాక్‌ బౌలర్‌.. 24 ఏళ్లకే అరుదైన రికార్డు

T20 world cup | ఒకే రోజు రెండు మ్యాచులు వర్షార్పణం.. మినీ యాషెస్‌, అఫ్గాన్- ఐర్లాండ్‌ మ్యాచ్‌ల రద్దు

T20 world cup | పాకిస్థాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. ఉత్కంఠ పోరులో ఒక పరుగు తేడాతో సూపర్‌ విక్టరీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News