Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsSangareddy Collector | విద్యార్థులకు 10/10 GPA రావాలి.. టీచర్లతో బాండ్ పేపర్‌ రాయించుకున్న సంగారెడ్డి...

Sangareddy Collector | విద్యార్థులకు 10/10 GPA రావాలి.. టీచర్లతో బాండ్ పేపర్‌ రాయించుకున్న సంగారెడ్డి కలెక్టర్?

Sangareddy Collector | ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు కోసం అధికారులు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకూ ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు అధికారులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో ఎక్కువ విద్యార్థులందరికీ 10/10 GPA సాధించేలా కృషి చేయాలని అధికారులకు సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్ చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది.

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణతకు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమావేశం పెట్టారు. పలు సూచనలు చేశారు. విద్యార్థుల గురించి ఆరాతీశారు. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు 10/10 జీపీఏ రావాలని సూచించారు. ఈ క్రమంలో తమ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులకు 10/10 జీపీఏ తెప్పించగలరో చెప్పాలని ఉపాధ్యాయుల చేతిలో బాండు పేపర్లు పెట్టారు విద్యాశాఖ అధికారులు.

అంతటితో ఆగకుండా బాండ్‌ పేపర్‌లో చెప్పినంత మంది విద్యార్థులకు 10/10 జీపీఏ తీసుకురావాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. బాండ్‌ పేపర్‌లో చెప్పినంత మందికి 10/10 జీపీఏ రాకుంటే తమపై శాఖ పరమైన చర్యలు తీసుకోవచ్చు అని ప్రధానోపాధ్యాయులు రాసిచ్చినట్లుగా సంతకాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, విద్యాశాఖ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటికే సంగారెడ్డి కలెక్టర్ పలుమార్లు వార్తల్లో నిలిచారు. కేసీఆర్‌ని ఓ సభలో పొగిడి వివాదాలకు తెర తీశారు. ఇప్పుడు బాండ్‌ పేపర్లు రాయించుకొని మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | కొండగట్టు అంజన్న మీద పవన్‌ కళ్యాణ్‌కి అంత సెంటిమెంట్‌ ఎందుకు ? వారాహికి అక్కడే పూజలు చేయడానికి కారణమేంటి ?

Fire Accident | సికింద్రాబాద్ అగ్రిప్రమాదం ఘటనలో ముగ్గురు సజీవ దహనం.. బిల్డింగ్ కూల్చివేతపై నిర్ణయం తీసుకోనున్న అధికారులు

Kamareddy Master Plan | కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. రైతుల ఆందోళనకు తలొగ్గిన సర్కార్



Post Settings

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News