Home News AP Rajinikanth | ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం నచ్చలేదు.. రాజకీయాలపై ఓపెన్ అయిన రజినీకాంత్

Rajinikanth | ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం నచ్చలేదు.. రాజకీయాలపై ఓపెన్ అయిన రజినీకాంత్

Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే రజినీ ఎప్పుడో వాటిని చేసి చూపించాడు. కేవలం తమిళనాట మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ , మలేసియా, ఇండోనేసియా వంటి పలు దేశాల్లో కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు. ఎంతో ఫాలోయింగ్ ఉన్న రజినీ సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడును శాసించాలని అభిమానులు ఆకాంక్షించారు. కానీ ఎప్పటికప్పుడు రజినీ రాజకీయాల్లోకి వచ్చినట్టే వచ్చి దూరం జరుగుతున్నారు. గత ఎన్నికల సమయంలో అయితే ఏకంగా పార్టీ పెడతా అన్నట్లు సంకేతాలు ఇచ్చి కూడా వెనక్కి తగ్గారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను చివరి నిమిషంలో ఎందుకు విరమించుకున్నాడో రజినీ తాజాగా బయటపెట్టాడు.

సెపియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవానికి రజనీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయి మళ్లీ ఎందుకు ఆగిపోయారో వివరించాడు. గత ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వద్దామని అనుకున్నప్పటికీ వైద్యుల సూచన మేరకు నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని రజినీ బయటపెట్టాడు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశాడు. పార్టీ పెడదామని అనుకున్న సమయానికి కిడ్నీ సమస్య ఉండటంతో పాటు కరోనా వైరస్ తీవ్రంగా ఉండటంతో జనాల్లోకి వెళ్లడం అంత మంచిది కాదని వైద్యులు సూచించారని ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నాడు. దీంతో ఆయన గురించి కూడా రజినీకాంత్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

వెంకయ్య నాయుడికి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని రజినీకాంత్ తెలిపారు. వెంకయ్య గొప్ప నాయకుడు.. కానీ ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టి ఆయన్ను రాజకీయాల నుంచి దూరం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవు. చాలా విషయాల్లో ప్రోటోకాల్ కండిషన్స్ ఉంటాయి. అలా అని, నేను ఉపరాష్ట్రపతి పదవిని కించపరచడం లేదు. వెంకయ్యనాయుడు మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగి ఉంటే బాగుండేది. అని రజనీకాంత్ అన్నారు. చిన్న మచ్చకూడా లేకుండా రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగిన వ్యక్తి వెంకయ్యనాయుడు అని రజినీకాంత్ కొనియాడారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Exit mobile version