Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsTomato Curry | కోడలు వండిన టమాట కర్రీ అత్త ప్రాణం మీదకు తెచ్చింది.. మహబూబాబాద్‌లో...

Tomato Curry | కోడలు వండిన టమాట కర్రీ అత్త ప్రాణం మీదకు తెచ్చింది.. మహబూబాబాద్‌లో దారుణం

Tomato Curry | కోడలు వండిన టమాట కర్రీ బాగోలేదని చెప్పడమే ఆ అత్త పాపమైంది. వంట సరిగ్గా చేయడమే నేర్చుకోమని మందలించినందుకు కన్న కొడుకు దృష్టిలోనే చెడ్డదానిగా మారింది. కొద్దిలో అతని చేతిలో ప్రాణం పోయేదే. కానీ వెంట్రుకవాసిలో తప్పించుకుంది. స్థానికులు రక్షించడంతో గాయాలతో బయటపడింది. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

మహబూబాబాద్ జిల్లా వేంనూరుకు చెందిన బుజ్జి కోడలు టమాట కర్రీ వండింది. అయితే కోడలు వండిన వంట అత్తకు రుచించలేదు. ఇదే విషయమై టమాట కూర బాగోలేదని చెప్పి కోడలిని మందలించింది. అత్త మాటలకు కోడలు మనస్తాపం చెందింది. భర్త మహేందర్ రాగానే జరిగిన విషయం మొత్తం చెప్పింది. తనను అత్త బుజ్జి అవమానించిందంటూ చెప్పి బోరున విలపించింది.

భార్య మాటలతో రెచ్చిపోయిన మహేందర్ వెంటనే తన తల్లి దగ్గరకు ఆవేశంగా వెళ్లాడు. నా భార్యనే అన్ని మాటలు అంటావా అని రెచ్చిపోయాడు. మటన్ కొట్టే కత్తితో సొంత తల్లిపైకే దిగాడు. ఈ దాడిలో బుజ్జి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పరుగున వచ్చి మహేందర్‌ను ఆపారు. గాయపడ్డ బుజ్జిని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహేందర్‌పై బంధువులు పోలీసులు ఫిర్యాదు చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

COVID in China | చైనాలో 90 కోట్ల మందికి సోకిన కరోనా.. ఇంకో రెండు నెలల్లో మరింత విజృంభించే ఛాన్స్

LPG Cylinder | సిలిండర్ తీసుకొచ్చినందుకు రూ.30 అడిగిన డెలివరీ బాయ్.. గ్యాస్ ఏజెన్సీకి లక్ష రూపాయలు ఫైన్

Air India | ఎయిరిండియా మూత్ర విసర్జన కేసులో ఊహించని ట్విస్ట్‌.. ఆమెపైనే శంకర్‌ ఆరోపణలు!

Santokh singh chaudhary | భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి

Kerala Schools | ఇక స్కూళ్లలో సర్‌… మేడమ్ అనాల్సిన అవసరం లేదు… ఓన్లీ టీచర్‌.. ఆదేశాలు జారీ !

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News