Home News International The Moon | భూమి నుంచి రోజురోజుకీ దూరం వెళ్లిపోతున్న చందమామ.. కారణమేంటంటే…

The Moon | భూమి నుంచి రోజురోజుకీ దూరం వెళ్లిపోతున్న చందమామ.. కారణమేంటంటే…

Image by kjpargeter on Freepik

The Moon | చందమామ రావె.. జాబిల్లి రావె.. కొండెక్కి రావె.. గోగిపూలు తేవే అంటూ చిన్న పిల్లలకు గోరుముద్దలు తినిపించేందుకు పాటలు పాడుతుంటారు. ఆ పాటలు విన్న పిల్లలు నిజంగానే చందమామ దగ్గరికి వస్తాడేమో అని కడుపు నిండా భోంచేసేస్తారు. మన చిన్నప్పుడు ఈ పాటలు పాడే తినిపించారు. ఇప్పుడు మన పిల్లలకు ఫోన్‌లో ఈ పాటలు వినిపిస్తూనే తినిపిస్తున్నారు. అలా రోజూ చందమామ రావె.. జాబిల్లి రావె అని తమ పిల్లల కోసం అమ్మలు పిలుస్తూనే ఉన్నారు. కానీ చందమామ కిందకు రాకపోగా.. ఇంతకింత దూరం వెళ్లున్నాడట. రోజురోజుకీ భూమి నుంచి చంద్రుడు దూరం జరుగుతున్నాడట. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టారు.

భూమి నుంచి చంద్రుడు దూరం జరుగుతున్నాడని ఎప్పట్నుంచో పలువరు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. తాజాగా ఈ దూరం ఎంత అనేది అమెరికాలోని నేషనల్ రేడియా ఆస్ట్రానమీ అబ్జర్వేషన్ పరిశోధకులు తేల్చారు. భూమికి ఉపగ్రహమైన చంద్రుడు ప్రతి సంవత్సరం 3.8 సెంటిమీటర్ల చొప్పున దూరంగా వెళ్తున్నాడని గుర్తించారు. 1969లో అపోలో మిషన్‌లో భాగంగా చంద్రుడిపై ఏర్పాటు చేసిన ప్యానెళ్ల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించారు. 2.46 బిలియన్ సంవత్సరాల కాలంలో భూమి నుంచి 60వేల కిలోమీటర్ల దూరం జరిగిందని పేర్కొన్నారు.

చంద్రుడు దూరం ఎందుకు జరుగుతున్నాడు?

భూమిపై ఉష్ణోగ్రత, వాతావరణానికి చంద్రునితో సంబంధం ఉంటుంది. భూ కేంద్రం నుంచి కొంత దూరంగా ఓ నిర్ణీత కక్ష్య గుండా చంద్రుడు భ్రమణం చెందుతుంటాడు. దీన్నే మిలాన్ కోవిచ్ సైకిల్ అని పిలుస్తారు. అయితే ఇది రోజురోజుకీ భూమి నుంచి దూరంగా జరుగుతుంది. ఇలా భూమికి చంద్రుడు దూరంగా జరగడాన్ని లూనార్ రిసెషన్‌ అని అంటారు. ఇలా జరగడం వెనుక కారణం కూడా ఉంది.. అదేంటంటే.. భూమి, చంద్రుడు ఎవరి కక్ష్యలో వాళ్లు తిరిగే క్రమంలో చంద్రుని ఆకర్షణ కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు ఏర్పడుతుంటాయి. ఈ అలల కారణంగా భూ భ్రమణ వేగం స్వల్పంగా తగ్గుతుంది. అలా తగ్గిన శక్తి చంద్రుడు కోణీయ గతి కారణంగా గ్రహిస్తాడు. దీని కారణంగా నిర్ణీత కక్ష్య నుంచి చంద్రుడు దూరం జరుగుతుంటాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Bath | పెళ్లయిన ఆడవాళ్లు ఈ రోజుల్లో తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవు

Vasthu Tips | మంచంపై కూర్చొని భోజనం చేస్తున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా!

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Exit mobile version