Home Latest News RBI Withdraws 2000 note | మళ్లీ నోట్ల రద్దు.. రూ.2వేల నోటును ఉపసంహరించుకున్న ఆర్బీఐ

RBI Withdraws 2000 note | మళ్లీ నోట్ల రద్దు.. రూ.2వేల నోటును ఉపసంహరించుకున్న ఆర్బీఐ

RBI Withdraws 2000 note | మీ దగ్గర రూ.2వేల నోట్లు ఉన్నాయా? అయితే జాగ్రత్త ! వెంటనే బ్యాంక్‌కు వెళ్లి మార్చేసుకోండి. ఎందుకంటే 2016 పెద్ద నోట్ల రద్దు తరహాలోనే రూ.2వేల నోటును కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఈ నోట్లు ఇప్పటికిప్పుడు రద్దు కాకపోయినప్పటికీ సెప్టెంబర్‌ 30వ తేదీ తర్వాత ఇవి చెల్లుబాటు కావు. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఇకపై బ్యాంకులు కూడా కస్టమర్లకు రూ.2వేల నోట్లు ఇవ్వకూడదని ఆదేశించింది.

రూ.2వేల నోట్లు ఉన్న వాళ్లు మే 23వ తేదీ నుంచి నోట్లను మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. సెప్టెంబర్‌ 30వ తేదీలోగా ప్రాంతీయ బ్యాంకుల్లో వీటిని మార్చుకోవాలని పేర్కొంది. అయితే రోజులో ఒక వ్యక్తి కేవలం రూ.20వేల వరకు మాత్రమే మార్చుకోవచ్చని షరతు విధించింది.

Exit mobile version