Home News AP Republic Day | రిపబ్లిక్ డే సందర్భంగా 901 మందికి పోలీసు పతకాలు ప్రకటించిన కేంద్రం.....

Republic Day | రిపబ్లిక్ డే సందర్భంగా 901 మందికి పోలీసు పతకాలు ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారంటే..

Republic Day | రిపబ్లిక్ డేను పురస్కరించుకుని సైనిక, పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ వివిధ పతకాలను ప్రకటించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 901 మందిని ఎంపిక చేసింది. ఈ మేరకు అవార్డుల జాబితాను ప్రకటించింది. వీరిలో 93 మందిని రాష్ట్రపతి పోలీస్ మెడల్, 140 మందిని పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 668 మందిని పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్ కింద ఎంపిక చేసింది. అయితే రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పురస్కారం మాత్రం ఈసారి ఎవరికీ ప్రకటించలేదు.

ఇక గ్యాలంట్రీ పురస్కారాలు అందుకున్న 140 మందిలో అత్యధికంగా సీఆర్పీఎఫ్ నుంచి ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 31 మంది, జమ్మూకశ్మీర్ నుంచి 25, జార్ఖండ్ నుంచి 9, దిల్లీ, ఛత్తీస్‌గఢ్ నుంచి ఏడుగురు చొప్పున ఉన్నారు. ఇక ఏపీ నుంచి 17 మంది, తెలంగాణ నుంచి 15 మంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఏపీలో ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 15 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. తెలంగాణ నుంచి ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 13 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి

Read More Articles:

Pawan Kalyan | కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు చేయించిన పవన్ కళ్యాణ్.. అక్కడే ఎందుకు?

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

Pawan Kalyan | ఏపీ సీఎం జగన్‌కు గ్యాంబ్లింగ్‌ పిచ్చి.. ఆ డైమండ్‌ రాణితోనూ తిట్లు తింటున్నా: పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version