Home Latest News RCB vs UPW | ఎట్టకేలకు బెంగళూరు బోణీ.. యూపీ వారియర్స్‌పై ఘనవిజయం

RCB vs UPW | ఎట్టకేలకు బెంగళూరు బోణీ.. యూపీ వారియర్స్‌పై ఘనవిజయం

RCB vs UPW | టైమ్ 2 న్యూస్, ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌)లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. తొలి ఐదు మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు.. బుధవారం జరిగిన ఆరో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపొందింది. ఇప్పటికే ఐదు పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్న బెంగళూరు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. లీగ్ దశ ముగిసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తొలి విజయం నమోదు చేసుకుంది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన యూపీ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. గ్రేస్ హారీస్ (46) టాప్ స్కోరర్ కాగా.. కిరణ్ (22), దీప్తి (22) పర్వాలేదనిపించారు. కెప్టెన్ అలీసా హీలీ (1), దేవిక వైద్య (0), తహిలా మెక్గ్రాత్ (2), సిమ్రన్ (2) విఫలమవడంతో ఒక దశలో యూపీ 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇంకేముందు యూపీ వంద పరుగుల లోపే ఆలౌట్ కావడం ఖాయం అనుకుంటే.. గ్రేస్ హ్యారిస్ గొప్పగా పోరాడింది. వైస్ కెప్టెన్ దీప్తి శర్మతో కలిసి ఆరో వికెట్కు 69 పరుగులు జోడించి జట్టుకు పోరాడే స్కోరు అందించింది. బెంగళూరు బౌలర్లలో ఎలీస పెర్రీ 3, సోఫియా డివైన్, శోభన ఆశ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

స్మృతి మళ్లీ విఫలం..

స్వల్ప లక్ష్యఛేదనలో బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధన (0) మరోసారి విఫలమైంది. భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న స్మృతి ప్రతిసారి వాటిని అందుకోలేక చతికిలబడుతోంది. భారత టాప్ స్పిన్నర్ దీప్తి బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన స్మృతి క్లీన్ బౌల్డ్ అయింది. మరో ఓపెనర్ సోఫియా డివైన్ (6 బంతుల్లో 14; 2 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా త్వరగానే ఔట్ కావడంతో బెంగళూరుకు ఛేదన కష్టమే అనిపించింది. అయితే 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జట్టును హీతర్ నైట్ (24) ఆదుకుంది. ఎలీసా పెర్రీ (10)తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించింది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైనా.. కనిక అహుజా (30 బంతుల్లో 46; 8 ఫోర్లు, ఒక సిక్సర్), రిచా ఘోష్ (32 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఆకట్టుకోవడంతో బెంగళూరు సునాయాసంగా విజయ తీరాలకు చేరింది. యూపీ బౌలర్లలో దీప్తి రెండు వికెట్లు పడగొట్టింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన కనిక అహుజాకు ‘ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్తో గుజరాత్ జెయింట్స్ తలపడనుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో అశ్విన్‌.. ఏడు స్థానాలు ఎగబాకిన విరాట్‌ కోహ్లీ

Virat Kohli | ఆ భావనే నన్ను తినేసింది.. అంచనాల భారంతో సమస్యలు పెంచుకున్నా.. విరాట్‌ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

Hardik Pandya | ఈ మ్యాచ్‌ నెగ్గితే అతడే భావి భారత సారథి.. హార్దిక్‌ పాండ్యాపై ప్రశంసలు కురిపించిన సునీల్‌ గవాస్కర్‌

Mohammed Siraj | గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని: సిరాజ్‌

IND vs AUS | బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ మనదే.. ‘డ్రా’గా ముగిసిన చివరి టెస్టు.. కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు

Exit mobile version