Sunday, March 26, 2023
- Advertisment -
HomeLatest NewsRatan Tata | తనకు ఇష్టమైన కారు గురించి రతన్ టాటా భావోద్వేగపు పోస్టు.. నెట్టింట...

Ratan Tata | తనకు ఇష్టమైన కారు గురించి రతన్ టాటా భావోద్వేగపు పోస్టు.. నెట్టింట వైరల్!

Ratan Tata | దేశంలోని గొప్ప పారిశ్రామిక వేత్తల్లో రతన్ టాటా ఒకరు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రతన్ టాటా తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు. తాజాగా తనకు ఇష్టమైన కారు ఇదేనంటూ టాటా మోటార్స్ రూపొందించిన టాటా ఇండికా కారుపై తనకున్న ప్రేమను చాటుతూ పోస్టు పెట్టారు.

టాటా ఇండికా కారు పక్కన నిల్చున్న సమయంలో తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ” 25 ఏళ్ల క్రితం, టాటా ఇండికాను ప్రారంభించడం భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది. ఇది మధురమైన క్షణాలను గుర్తు చేస్తుంటుంది. నా హృదయంలో ఈ కారుకు ప్రత్యేక స్థానం ఉంది” అంటూ కారుపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.

టాటా మోటార్స్ 1998లో ప్యాసింజర్ కార్ల తయారీ ప్రస్థానాన్ని ఇండికాతో మొదలు పెట్టింది. ఇప్పట్లో ఈ కారు దేశీయంగా సంచలనం సృష్టించింది. విక్రయాల్లో దూసుకెళ్లింది. క్యాబ్ సర్వీస్ అంటే ఇండికానే అనేలా మారిపోయింది. తర్వాత ప్యాసింజర్ కార్లలో ఇతర మోడల్స్ విడుదల చేసినా ఆ కారుకు వచ్చినంతగా పేరు రాలేదు. 2018లో ఇండికా కారు తయారీని టాటా మోటార్స్ నిలిపివేసింది. రతన్ టాటా ఇండికా కారు గురించి పోస్టు చేయడంతో తమకు ఆ కారుతో అనుబంధాన్ని నెటిజన్లు కామెంట్ల రూపంలో షేర్ చేస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | నేను గెలుస్తానో ఓడుతానో తెలియదు.. కానీ గూండాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు: పవన్‌ కళ్యాణ్‌

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

flying bike | గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేస్తోంది.. ఇప్పుడే బుకింగ్‌ చేసుకోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News