Home Latest News Amrit Udyan | రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్‌ పేరు మార్చేసిన కేంద్ర ప్రభుత్వం

Amrit Udyan | రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్‌ పేరు మార్చేసిన కేంద్ర ప్రభుత్వం

Amrit Udyan | రాష్ట్రపతి భవన్‌లో ఉన్న ప్రఖ్యాత మొఘల్‌ గార్డెన్స్‌ ( Mughal Gardens ) పేరును కేంద్రం మార్పు చేసింది. ఇప్పటి వరకు మొఘల్‌ గార్డెన్స్‌ అని పిలిచే దానిని ఇక నుంచి అమృత్‌ ఉద్యాన్‌‌గా పిలవాలని సూచించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ థీమ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొఘల్ గార్డెన్స్‌ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చారని డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా వెల్లడించారు. అమృత్ ఉద్యాన్‌గా మారిన ఈ గార్డెన్‌ను ఇవాళ (ఆదివారం) ఉదయం ద్రౌపది ముర్ము ప్రారంభించారు.

ప్రతి ఏడాది నిర్వహించే ఉద్యానోత్సవంలో భాగంగా జనవరి 31 నుంచి మార్చి 26 వరకు ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. మార్చి 28 నుంచి 31వ తేదీ వరకు రైతులు, మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక సందర్శన ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలలో ఈ గార్డెన్ పూర్తిగా వికసించిన రంగురంగు పూలతో ఆహ్లాదకరంగా ఉండి కనువిందు చేస్తుంది. అందుకే ఈ సమయంలో ఈ గార్డెన్‌ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా వస్తుంటారు.

మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్‌ చార్‌ బాగ్‌ ను తనకు ఇష్టమైన తోటగా దీన్ని అభివర్ణిస్తారు. భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో ఎన్నో మొఘల్‌ గార్డెన్స్ ఉన్నాయి. వీటి గురించి బాబర్‌, హుమాయూన్‌, అక్బర్‌ ల జీవిత చరిత్రలలోనూ ఉంది. దీని గురించి మొట్టమొదటి సారిగా కాన్స్‌ టెన్స్ విల్లియర్స్‌ స్టార్ట్‌ రాసిన గార్డెన్స్‌ ఆఫ్‌ ది గ్రేట్‌ మొఘల్స్‌ లో వచ్చింది. దీని రచయిత భర్త బ్రిటన్‌ కు చెందిన భారత సైన్యంలో కల్నల్‌ గా పని చేసేవారు. వారు పింజోర్‌ గార్డెన్స్‌ లో నివసించేటప్పుడు ఆ మొఘల్‌ గార్డెన్‌ బాగోగులు చూసుకునే అవకాశం ఆమెకు దక్కింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Australian Open 2023 | ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సరికొత్త ఛాంపియన్‌గా సబలెంకా!

Nandamuri Tarakaratna | అత్యంత విషమంగా నందమూరి తారకరత్న ఆరోగ్యం.. ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస

Vijayashanthi on KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆయనో విష సర్పం!

Layoff | ఇంటర్వ్యూ చేస్తుండగానే హెచ్ఆర్ ఉద్యోగం ఔట్.. గూగుల్‌లో లే ఆఫ్‌ ఎఫెక్ట్!

Exit mobile version