Friday, April 19, 2024
- Advertisment -
HomeNewsAPViral News | అన్నమయ్య జిల్లాలో వింత ఘటన.. ఎంత దూరంలో వదిలిపెట్టినా గంటలో అక్కడికే...

Viral News | అన్నమయ్య జిల్లాలో వింత ఘటన.. ఎంత దూరంలో వదిలిపెట్టినా గంటలో అక్కడికే వచ్చేస్తున్న శ్వేతనాగు

Viral News | ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో ఓ శ్వేత నాగు స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది. గత పది రోజులుగా ఒకే దగ్గర్నుంచి కదలటం లేదు. ఎంత దూరం వదిలిపెట్టినా గంటలో అక్కడే ప్రత్యక్షమవుతోంది. ఈ విషయం ఈనోటా ఆనోటా విని ప్రజలు తండోపతండాలుగా పామును చూసేందుకు తరలి వస్తున్నారు. ఇక మహిళలైతే పూజలు, హారతులు, కొబ్బరికాయలతో హడావిడి చేస్తున్నారు. ఇంత చేస్తున్నా ఆ పాము మాత్రం అక్కడి నుంచి కదలనంటోంది.

ఈ వింత ఘటన అన్నమయ్య జిల్లాలోని బి. కొత్తకోట చెరువు కట్టపైన చోటుచేసుకుంది. పది రోజులుగా 4 అడుగుల నాగుపాము కట్టపైనుంచి కదలనంటోంది. దాన్ని స్థానికులు తీసుకెళ్లి దూరంగా వదిలేసినా మళ్లీ అక్కడికే గంటలో వచ్చేస్తోంది. వినడానికి విడ్డూరంగా అనిపించినా.. పెద్ద చెరువు కట్టపై పది రోజుల క్రితం స్థానికులు నాగుపామును చూశారు. చెరువు గట్టుపై పాములు ఉండటం సహజమేనని, కాసేపట్లో అక్కడి నుంచి వెళ్లిపోతుందని భావించారు. కానీ రెండు మూడు రోజులు ఆ పాము మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. దీంతో గత ఆదివారం నాగుపామును తీసుకెళ్లి దూరంగా విడిచి పెట్టి వచ్చేశారు. అంతటితో పాము కథ ముగిసిందనుకున్నారు.

కానీ సోమవారం ఉదయానికల్లా ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అక్కడికే పాము వచ్చేసింది. అయితే పామును అక్కడి నుంచి ఎలాగైనా పంపించి వేయాలని భావించిన స్థానికులు ఈసారి మరింత దూరం తీసుకెళ్లి వదిలేశారు. కానీ మళ్లీ కొన్ని గంటల్లోనే యథాస్థానంలోకి మళ్లీ వచ్చేసింది. ఈ విషయం స్థానికంగా చర్చానీయాంశంగా మారిపోయింది. ఈనోటా ఆనోటా అక్కడి ప్రజలందరికీ బుధవారం వరకు తెలిసిపోయింది.. ఇంకేముంది.. పామును చూసేందుకు వందల సంఖ్యలో జనాలు రావడం మొదలైంది. ఎవరూ లేని ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడే పరిస్థితి వచ్చింది.

ఇలా అయితే లాభం లేదనుకుని స్థానికులు మరోసారి పామును దూరంగా తీసుకెళ్లి వదిలేశారు. కానీ గంటకల్లా మళ్లీ అక్కడే ప్రత్యక్షమవడంతో మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని పాముకు పాలు పడుతున్నారు. పూజలు చేస్తున్నారు. హారతులు ఇస్తున్నారు. కొంతమంది పాము పడగపై కుంకుమ బొట్టుకూడా పెడుతున్నారు. మరికొంత మంది ఆ పామును పట్టుకుని మెడలో వేసుకుంటున్నారు. అయినా ఆ పాము మాత్రం ఎవరికీ హానీ చేయకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Amartya Sen | బీజేపీకి ఎదురులేదు అనుకోవద్దు.. 2024లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర.. నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు

Women’s Under 19 T20 World Cup | మహిళల అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ విజయం.. దంచికొట్టిన ఓపెనర్లు

Kodi Pandalu | ఏపీలో జోరుగా కోడిపందాలు.. ఆంక్షలున్నా తగ్గేదేలే అంటున్న పందెం రాయులు.. బహుమతులుగా కార్లు, బైకులు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News