Home Latest News Padma Awards | పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. చిన్న జీయర్‌ సహా 12 మంది...

Padma Awards | పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. చిన్న జీయర్‌ సహా 12 మంది తెలుగు వాళ్లకు పద్మ పురస్కారాలు

Padma Awards 2023

Padma Awards | టైం2న్యూస్, ఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. 2022 సంవత్సరానికి గానూ ఆరుగురికి పద్మవిభూషణ్, తొమ్మిది మందికి పద్మభూషణ్ అవార్డులతోపాటు 91 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. తెలంగాణ నుంచి చిన్నజీయర్ స్వామితో పాటు కమేలేశ్ పటేల్‌కు పద్మభూషణ్ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.

వీరితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సహా ఏడుగురికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. తెలంగాణ నుంచి ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి సహా ముగ్గురికి కేంద్రం పద్మ శ్రీ అవార్డులు దక్కాయి.

పద్మ విభూషణ్ గ్రహీతలు..

గుజరాత్‌కు చెందిన బాలకృష్ణ దోషికి ఆర్కిటెక్చర్‌లో, మహారాష్ట్రకు చెందిన జాకీర్ హుస్సేన్‌కు ఆర్ట్స్‌లో .. కర్ణాటకకు చెందిన ఎస్.ఎం కృష్ణకు రాజకీయ రంగంలో.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దిలీప్ మహలనబిస్‌కు వైద్య రంగంలో.. అమెరికాకు చెందిన శ్రీనివాసన్ వర్ధన్‌కు సైన్స్ అండ్ టెక్నాలజీలో.. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ములయాం సింగ్‌కు రాజకీయ రంగం నుంచి పద్మవిభూషణ్ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.

పద్మభూషణ్ గ్రహీతలు

తెలంగాణ నుంచి చిన్నజీయర్ స్వామితో పాటు కమలేశ్ డీ పటేల్‌కు ఆధ్యాత్మికంలో.. కర్ణాటకకు చెందిన ఎస్ ఎల్ బైరప్పకు సాహిత్యం, విద్యలో.. మహారా‌ష్ట్ర నుంచి కుమార మంగళం బిర్లాకు వ్యాపార రంగంలో.. మహారాష్ట్రకు చెందిన దీపక్ ధార్‌కు సైన్స్ అండ్ టెక్నాలజీలో.. తమిళనాడు నుంచి వాణీ జయరామ్‌కు ఆర్ట్స్‌లో.. మహారాష్ట్ర నుంచి సుమన్ కల్యాణ్‌పూర్‌కు ఆర్ట్స్‌లో.. ఢిల్లీకి చెందిన కపిల్ కుమార్‌కు సాహిత్యం, విద్యలో.. కర్ణాటక నుంచి సుధా మూర్తికి సామాజిక సేవలో పద్మభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది.

తెలంగాణ నుంచి పద్మశ్రీలు..

మోదడుగు విజయ్ గుప్తాకు సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో.. పసుపులేటి హనుమంత రావుకు వైద్య రంగంలో.. బీ రామకృష్ణ రెడ్డికి సాహిత్యం, విద్యలో పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

ఏపీ నుంచి పద్మశ్రీలు..

ఎంఎం కీరవాణికి ఆర్ట్స్‌లో.. గణేశ్ నాగప్ప కృష్ణ రాజనగరాకు సైన్స్ అండ్ టెక్నాలజీలో.. సీవీ రాజుకు ఆర్ట్స్‌లో.. అబ్బరెడ్డి నాగేశ్వర రావుకు సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో…. కోట సచ్చిదానంద శాస్త్రికి ఆర్ట్స్‌లో.. సంకురాత్రి చంద్ర శేఖర్‌కు సామాజిక సేవలో.. ప్రకాశ్ చంద్రసూద్‌కు సాహిత్యం, విద్యలో పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Uorfi Javed | నాలాంటి సింగిల్స్‌కు ముంబైలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టమైపోయింది.. బిగ్‌బాస్‌ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ ఆవేదన

Women’s IPL | పురుషుల ఐపీఎల్‌ను మించిపోయిన మహిళల లీగ్‌.. రికార్డు ధరకు వేలం

Cholesterol | చెడు కొలెస్ట్రాల్‌కి మంచి కొలెస్ట్రాల్‌కి తేడా ఏంటి.. ? చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి?

Republic Day | రిపబ్లిక్ డే సందర్భంగా 901 మందికి పోలీసు పతకాలు ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారంటే..

Ritu Chowdary | ఫొటో దిగినప్పుడు అనుకోలేదు.. ఇదే చివరి ఫొటో అవుతుందని.. కన్నీళ్లు పెట్టిస్తున్న రీతూ చౌదరి పోస్టు

Exit mobile version