Home News AP viral news | బాపట్ల జిల్లాలో 25 అడుగులు వెనక్కి జరిగిన బిల్డింగ్‌

viral news | బాపట్ల జిల్లాలో 25 అడుగులు వెనక్కి జరిగిన బిల్డింగ్‌

Image by rawpixel.com on Freepik

viral news | ఇల్లు జరగడమేంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ మీరు చదివింది నిజమే ! ఏపీలోని బాపట్ల జిల్లాలో ఓ ఇంటిని 25 అడుగుల వెనక్కి జరుపుతున్నారు. రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉందని ఓ ఇంటిని కూల్చాలని నోటీసులు జారీ చేయడంతో ఆ ఇంటి యజమాని ఈ నిర్ణయం తీసుకున్నాడు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి తన ఇంటిని కాస్త వెనక్కి జరుపుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామానికి చెందిన ఖాదర్‌ బాబుకు రోడ్డు పక్కన రెండంతస్తుల భవనం ఉంది. ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఐదేళ్ల క్రితం ఈ ఇంటిని నిర్మించుకున్నాడు. ఆశపడి కట్టుకున్న ఇంట్లో తనివితీరా కొద్దిరోజులు ఉన్నాడో లేదో అధికారుల నుంచి నోటీసులు వచ్చాయి. రోడ్డు విస్తరిస్తున్నాం.. ఇందుకు మీ ఇల్లు అడ్డంగా ఉంది కాబట్టి కొంత భాగం తొలగించాలని వచ్చిన నోటీసులు చూసి షాకయ్యాడు. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కూల్చేస్తామని అంటే ఖాదర్‌ బాబు మనసు ఒప్పుకోలేదు. అలా అని కూల్చకుండా ఉండటం సాధ్యపడదు. రోడ్డు విస్తరణ పనులకు ఎలాగైనా సహకారం అందించాల్సిందే.

కష్టపడి కట్టుకున్న ఇంటిని కూలగొట్టకుండా కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా ఉన్నాయా? అని ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేశాడు. తన కుమారులతో కలిసి వెతుకుతుండగా అప్పుడే వాళ్లకు ఓ టెక్నాలజీ గురించి తెలిసింది. ఇంటిని ఉన్న చోటు నుంచి మరో చోటుకు జరిపే టెక్నాలజీ గురించి వాళ్లు తెలుసుకున్నారు. ఈ సాంకేతికత సాయంతో ఇంటిని కాస్త వెనక్కి జరిపితే తమ సమస్య పరిష్కారమవుతుందనే నిర్ణయానికి వచ్చారు. తమ ఇంటిని రోడ్డు నుంచి 25 అడుగుల వెనక్కి జరిపేందుకు జేజే బిల్డింగ్‌ లిఫ్టింగ్‌ వర్క్స్‌ వారితో ఒప్పందం చేసుకున్నాడు. దీనికి మొత్తం 15 లక్షల వరకు ఖర్చవుతుందట. డబ్బులు పోయినప్పటికీ తమ ఇల్లు చెక్కు చెదరకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఖాదర్‌ బాబు చెబుతున్నాడు. ఇంటిని జరిపే సమయంలో ఎటువంటి నష్టం వాటిల్లినా సదరు సంస్థనే భరిస్తుందని పేర్కొన్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rakul Preet Singh | నాతో షూటింగ్ చేసి.. వేరే హీరోయిన్‌ను తీసుకునేవాళ్లు.. నాటి రోజులు గుర్తు చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

mahanati savitri | లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్.. వ్యాపారంలో సక్సెస్ కావడానికి మహానటి సావిత్రికి సంబంధం ఉంది తెలుసా?

Naga babu | ఏపీలో జనసేన పొత్తులపై మెగాబ్రదర్ కీలక వ్యాఖ్యలు.. పవన్‌ను ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమన్న నాగబాబు!

Kangana Ranut | ఆర్థిక ఇబ్బందుల్లో కంగనా రనౌత్.. ఆ సినిమా కోసం తన ఆస్తులన్ని తాకట్టు పెట్టిందా ?

Exit mobile version