Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsCorona cases in India | భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ BF.7 కేసులు.. అప్రమత్తమైన వైద్య...

Corona cases in India | భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ BF.7 కేసులు.. అప్రమత్తమైన వైద్య మండలి.. కీలక ఆదేశాలు జారీ

Corona cases in India | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ BF.7 చైనాలో విలయతాండవం చేస్తోంది. ఇఫ్పుడు భారత్‌లోనూ అదే వేరియంట్ కేసులు నమోదు కావడంపై భారత వైద్య మండలి ( Indian medical association) అప్రమత్తమైంది. దేశ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించింది. బయటకు వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, డిస్టెన్స్ మెయింటేన్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు శానిటర్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించింది.

దేశంలో కరోనా వ్యాప్తిపై లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సూఖ్ మాండవీయ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచామని లోక్‌సభలో వెల్లడించారు. ఇవాల్టి నుంచి అంతర్జాతీయ ప్రయాణీకులకు ర్యాండమ్‌గా నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నారు. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రి లోక్‌సభలో ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భారత వైద్యమండలి కీలక ప్రకటన విడుదల చేసింది. కరోనా సెకండ్ వేవ్ లాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రాన్ని ఐఎంఏ అప్రమత్తం చేసింది. మెడిసిన్స్, ఆక్సిజన్, అంబులెన్సులు, వెంటిలేటర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కోరింది. కేంద్ర, రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, సంబంధిత విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇప్పటికే కరోనాకు సంబంధించి కేంద్రం పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. తాజాగా ఐఎంఏ కూడా పలు సూచనలు చేసింది. వివాహాలు, రాజకీయ సమావేశాలు వాయిదా వేసుకోవాలని కోరింది. అత్యవసరమైతే తప్ప అంతర్జాతీయ ప్రయాణాలు చేయొద్దని ప్రజలను కోరింది. జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, తలనొప్పి లాంటి సమస్యలుంటే వెంటనే కరోనా పరీక్షలు చేపించుకుని, వైద్యలను సంప్రదించాలని సూచించింది. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరింది.

24 గంటల్లో 5.37 లక్షల కేసులు

ఇప్పటికే అమెరికా, బ్రెజిల్, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. 24 గంటల్లో ఈ దేశాల్లో దాదాపు 5.37 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ 145 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒమిక్రాన్ వేరియంట్ BF.7 కేసులే నాలుగు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత వైద్యమండలి ప్రజలను అప్రమత్తం చేసింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Covid situation in china | చైనాలో పరిస్థితి అంత దారుణంగా ఉందా? కరోనా అంతమయ్యేది ఎప్పుడు.. నిపుణుల అభిప్రాయమిదే!

Mancherial | ఎన్టీఆర్ సినిమా చూసి హత్యకు స్కెచ్.. మంచిర్యాలలో ఆరుగురి సజీవదహనం కేసులో ఎన్నో ట్విస్టులు

MHO Srinivasa rao | ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది.. తెలంగాణ డీఎంఎచ్‌ఓ శ్రీనివాస్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు

micron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ BF.7 లక్షణాలివే..

కరోనా లాక్‌డౌన్‌ తెచ్చిన భయం.. మూడేళ్లుగా గదిలో నుంచి బయటకు రాని తల్లీకూతుళ్లు

Adar Poonawalla on corona cases | కరోనా కేసులు పెరుగుతుండటంపై అదార్ పూనావాలా కీలక వ్యాఖ్యలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే కానీ..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News