Home Latest News Odisha Health Minister | ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య శాఖ మంత్రి మృతి.. దిగ్భ్రాంతి...

Odisha Health Minister | ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య శాఖ మంత్రి మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా సీఎం

Odisha Health Minister | ఒడిశాలోని ఝూర్సుగూడలో ఏఎస్సై కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నవ కిశోర్‌ దాస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న మంత్రిపై గోపాల్ దాస్‌ అనే ఏఎస్సై పాయింట్ బ్లాంక్‌లో ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్లు ఛాతిలోకి దూసుకెళ్లాయి. మంత్రి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే భువనేశ్వర్‌లోని ఆస్పత్రికి హెలికాప్టర్‌లో తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ నవ కిశోర్ దాస్ కన్నుమూశారు.

ఒక బుల్లెట్‌ మంత్రి గుండెలోకి, ఊపిరితిత్తుల్లోకి దూసుకుపోయింది. ఐసీయూలో ఉన్న ఆయనను రక్షించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కాల్పులు జరిపిన నిందితుడు గోపాల్ దాస్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆదేశించారు.

మంత్రిపై ఏఎస్సై ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉంటే గోపాల్ దాస్‌ గత ఎనిమిది సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధ పడుతున్నట్లు అతని భార్య వెల్లడించింది. కాల్పులు జరిపిన విషయం తమకు మీడియా ద్వారా మాత్రమే తెలిసిందని వాపోయింది. ఈ ఘటన జరగడానికి ముందు ఉదయం పూట ఆయన వీడియో కాల్‌ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. తన భర్తతో ఎవరైనా ఈ పని చేయించారేమో అనే అనుమానాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

mobiles on plane | విమానం ఎక్కగానే మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేయమని ఎందుకు చెబుతారు?

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version