Home Latest News Medical Student Preethi | సైఫ్ ఒక్కడే కాదు.. ప్రీతి మరణానికి ఇదీ కారణమేనా. పీజీ...

Medical Student Preethi | సైఫ్ ఒక్కడే కాదు.. ప్రీతి మరణానికి ఇదీ కారణమేనా. పీజీ వైద్య విద్యార్థిని కేసులో కొత్త ట్విస్ట్

Medical Student Preethi | పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతి కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. సీనియర్ సైఫ్ వేధింపులు తాళలేక ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పీజీ సీటు వచ్చిన సమయంలో ప్రీతి ఇచ్చిన రూ.50లక్షల అడ్మిషన్ బాండ్ కూడా ఆమె మరణానికి గల కారణమని తెలుస్తోంది.

అసలేంటి అగ్రిమెంట్ బాండ్?

ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత పీజీ సీటు రావడం ఒక ఎత్తయితే.. మూడేళ్లలో కోర్సు పూర్తి చేయడం ఇంకో ఎత్తు. చాలామంది కష్టపడి సీటు అయితే సాధిస్తారు. కానీ.. తరగతులతో పాటు ప్రాక్టికల్స్‌లో సీనియర్స్‌తో కలిసి పనిచేయడానికి చాలా ప్రయాస పడాల్సి ఉంటారు. దీంతో కొంతమంది మధ్యలోనే మానేసి వెళ్లిపోతుంటారు. దీంతో ఆ విద్యార్థుల మీద పెట్టిన ఖర్చు మొత్తం వృథా అవుతుంది. అందుకే ఆ ఖర్చు మొత్తం విద్యార్థులతోనే చెల్లించేలా అడ్మిషన్ బాండ్ నిబంధన ఉంది. ఈ బాండ్ గత ఏడాది వరకు రూ.20 లక్షలుగా ఉండేది. అంటే ఎవరైతే పీజీ సీటు వచ్చిన తర్వాత మధ్యలో వెళ్లిపోతారో.. వాళ్లు రూ.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఉన్నప్పటికీ పీజీలో డ్రాపవుట్స్ ఎక్కువగానే ఉన్నాయి. దీంతో వాటిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అగ్రిమెంట్ బాండ్‌ను రూ.50 లక్షలకు పెంచింది. ఆ నిర్ణయం కూడా ప్రీతి మరణానికి కారణమనే వాదన వినిపిస్తోంది.

ఎన్నిసార్లు చెప్పినా ప్రీతి వినిపించుకోలే

సీనియర్ విద్యార్థిని సైఫ్ వేధింపులు రోజురోజుకీ ఎక్కువ కావడంతో చాలాసార్లు తల్లిదండ్రులతో చెప్పుకుని ప్రీతి బాధపడింది. అది చూసిన ప్రీతి తండ్రి నరేందర్.. అంత ఇబ్బంది పడటం ఎందుకు పింకీ.. పీజీ మానేసి వచ్చేయ్ అని చాలాసార్లు అడిగాడట. కానీ అంత మొత్తం ఎలా అడ్జస్ట్ చేస్తావ్.. వద్దులే అని ప్రీతినే తండ్రికి నచ్చజెప్పిందని ఇప్పుడు చర్చ నడుస్తోంది. పీజీ కంటిన్యూ చేద్దామంటే సీనియర్ వేధింపులు.. మానేసి వెళ్దామంటే రూ.50 లక్షల భారం.. వీటన్నింటితో సతమతమయ్యే ప్రీతి బలవన్మరణానికి పాల్పడిందని ఇప్పుడు అంతా చర్చ నడుస్తోంది. అందుకే కొత్త అడ్మిషన్ బాండ్ నిబంధనలు తీసుకువచ్చి విద్యార్థులకు ఉపశమనం కలిగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే ర్యాగింగ్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ర్యాగింగ్ చేస్తే మెడికల్ సీటు రద్దు ?

ప్రీతి ఆత్మహత్యతో ర్యాగింగ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు నిర్ధరణ అయితే మెడికల్ సీటు రద్దు చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో కసరత్తు మొదలుపెట్టింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Triangle Love Story | నవీన్‌ను చంపేసి బాడీ పార్ట్స్ బ్యాగులో పట్టుకెళ్లాడు.. లొంగిపోయే ముందు వాటిని కాల్చేశాడు.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో విస్తుపోయే నిజాలు

Medical Student Preethi | సైఫ్ ఒక్కడే కాదు.. ప్రీతి మరణానికి ఇదీ కారణమేనా. పీజీ వైద్య విద్యార్థిని కేసులో కొత్త ట్విస్ట్

Samantha | సమంత రెండు చేతులకు గాయాలు.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ

Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు

Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్‌ చేసి బాధపడ్డ ప్రీతి

Exit mobile version