Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentNora Fatehi | జాక్వెలిన్ ఫెర్నాండేస్‌పై కేసు వేసిన బాహుబలి నటి

Nora Fatehi | జాక్వెలిన్ ఫెర్నాండేస్‌పై కేసు వేసిన బాహుబలి నటి

Nora Fatehi vs Jacqueline Fernadez | మనీలాండరింగ్ కేసుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ మరోసారి చిక్కుల్లో పడింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన కెరీర్‌ను నాశనం చేసేందుకు జాక్వెలిన్ ప్రయత్నించిందంటూ ఆమెపై నోరా ఫతేహి పరువు నష్టం దావా వేసింది.జాక్వెలిన్ వల్ల షోలు, ప్రముఖ బ్రాండ్‌లతో ఒప్పందాలు కోల్పోయానని వెల్లడించింది.

సుఖేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ పేరు ఇటీవల ప్రముఖంగా వినిపించింది. సుఖేశ్ నుంచి ఆమె విలువైన కానుకలను అందుకున్నట్టుగా పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. జాక్వెలిన్‌ను పలుమార్లు విచారించారు. ఈ విచారణలో నోరా ఫతేహి సహా పలువురు బాలీవుడ్ నటులకు కూడా సుఖేశ్‌తో సంబంధాలు ఉన్నాయని వెల్లడించింది. దీంతో బాలీవుడ్‌ మీడియాలో నోరా ఫతేహి పేరు కూడా మార్మోగింది.

జాక్వెలిన్ చేసిన వ్యాఖ్యలను నోరా ఫతేహి ఖండించింది. అనవసరంగా తనను మనీలాండరింగ్ కేసులో ఇరికించేందుకు జాక్వెలిన్ ప్రయత్నించిందని మండిపడింది. జాక్వెలిన్‌పై 200 కోట్లకు దిల్లీ కోర్టులో పరువు నష్టం దావా వేసింది.ఇద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉండటంతో తనను తొక్కేసేందుకు జాక్వెలిన్ ప్రయత్నించిందని నోరా తన పిటిషన్‌లో పేర్కొంది.తన వల్ల ప్రముఖ టీవీ షోలు, బ్రాండ్లు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Anjali Marriage | అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. పెళ్లి వార్తలపై స్పందించిన అంజలి

Ramcharan – Upasana | మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్

Pawan kalyan new movie | పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా టైటిల్ ఫిక్సయిందా.. అదే టైటిల్ అయితే ఫ్యాన్స్ కి పూనకమే!

Nandamuri Balakrishna new movie | బాలకృష్ణ వర్కింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందా? బాలయ్య కోసం అనిల్ రావిపూడి రూటు మార్చేస్తున్నాడా ?

Anupama Parameswaran | అందం, అభినయం రెండూ ఉన్నా అనుపమ పరమేశ్వరన్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎందుకు కాలేకపోయింది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News