Home Latest News Nikhat Zareen | మేరీ కామ్‌ రికార్డు సమం చేసిన తెలంగాణ బిడ్డ.. బాక్సింగ్‌లో వరుసగా...

Nikhat Zareen | మేరీ కామ్‌ రికార్డు సమం చేసిన తెలంగాణ బిడ్డ.. బాక్సింగ్‌లో వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిఖత్‌

Image Source: Boxing Federation twitter

Nikhat Zareen | భారత స్టార్‌ బాక్సర్‌, తెలంగాణ బిడ్డ నిఖత్‌ జరీన్‌ మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌గా వరుసగా రెండో సారి అవతరించింది. 48-50 కిలోల విభాగంలో నిఖత్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకుని సత్తా చాటింది. మేరీ కామ్‌ రికార్డును సమం చేసింది. గతంలో మేరీ కామ్‌ కూడా బాక్సింగ్‌ ప్రపంచ చాంపియన్‌ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించింది.

ఢిల్లీలో జరగుతున్న ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో నిఖత్‌ జరీన్‌ వియాత్నంకు చెందిన గుయెన్‌ థి టామ్‌ను ఫైనల్లో ఓడించింది. గెయెన్‌ గతంలో రెండు సార్లు ఆసియా కప్‌ విజేత కావడం గమనార్హం. మొదటి నుంచి జోరు కొనసాగించిన నిఖత్‌ క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన చుతామత్ పై 5-2 తేడాతో విజయం సాధించింది. ఫైనల్లోనూ తన జోరు కొనసాగించిన నిఖత్‌ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. పంచ్‌ల వర్సం కురిపించింది. విశ్వ విజేతగా అవతరించింది. భారత్‌ తరఫున స్వీటి, నీతూ గంగాస్‌, లవ్లీనా, నిఖత్‌ జరీన్‌లు స్వర్ణ పతకాలు అందుకున్నారు. 75 కిలోల విభాగంలో ఆదివారం నాడు లవ్లీనా స్వర్ణ పతకాన్ని సాధించింది.

Exit mobile version