Home News International Nepal plane crash | నేపాల్ విమాన ప్రమాదంలో 42 మృతదేహాలు వెలికితీత.. మృతుల్లో ఐదుగురు...

Nepal plane crash | నేపాల్ విమాన ప్రమాదంలో 42 మృతదేహాలు వెలికితీత.. మృతుల్లో ఐదుగురు భారతీయులు?

Nepal plane crash | నేపాల్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 42 మృతదేహాలను వెలికితీశారు. ఇందులో ఐదుగురు భారతీయులు మరణించినట్టు అనుమానిస్తున్నారు. ప్లేన్ క్రాష్ ఘట గురించి తెలియగానే నేపాల్ ప్రధాని హుటాహుటిన ఘటనాస్థలికి బయల్దేరి వచ్చారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి బయల్దేరిన యేతి ఎయిర్‌లైన్ ఏటీఆర్-72 విమానం పొఖారా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయ్యింది. విమానం కుప్పకూలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఎయిర్‌పోర్టును మూసివేసిన అధికారులు.. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. శిథిలాల కింద మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు 42 మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విమాన ప్రమాదం విషయం తెలియగానే నేపాల్ ప్రధాని ప్రచండ.. మంత్రివర్గంతో అత్యవసర సమావేశం అయ్యారు. అనంతరం ఖాట్మాండూ విమానాశ్రయానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Telangana secretariat | సీఎం కేసీఆర్ బర్త్ డే నాడే తెలంగాణ సెక్రటేరియట్ ఓపెనింగ్.. మంత్రి వేముల వెల్లడి

Nepal plane crash | రన్ వేపై కుప్పకూలిన విమానం.. ప్లేన్‌లో 68 మంది ప్రయాణికులు

Vande Bharat Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడవనున్న రైలు

Ban on Gas stoves | చిన్న పిల్లల్లో పెరుగుతున్న అస్తమా.. గ్యాస్ స్టౌవ్ బ్యాన్ చేసే యోచనలో అమెరికా?

Miss Universe 2022 | మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న బొన్నీ గాబ్రియెల్.. 11 ఏళ్ల తర్వాత అమెరికాకు కిరీటం

Exit mobile version