Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLatest NewsAtal Bihari Vajpayee | మాజీ ప్రధానికి 10 వేల ఎకరాల్లో భారీ స్మృతివనం.. మధ్యప్రదేశ్‌...

Atal Bihari Vajpayee | మాజీ ప్రధానికి 10 వేల ఎకరాల్లో భారీ స్మృతివనం.. మధ్యప్రదేశ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

Atal Bihari Vajpayee | మధ్యప్రదేశ్‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత ఏడాది వాజ్‌పేయి వర్ధంతిని పురస్కరించుకుని గ్వాలియర్‌లో భారీ స్థాయిలో స్మారకాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీకి అనుగుణంగా వాజ్‌పేయి జయంతి సందర్భంగా గ్వాలియర్‌లో 10వేల ఎకరాల భూమిని మధ్యప్రదేశ్‌ సర్కారు కేటాయించింది.

ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆదేశాలకు అనుగుణంగా గ్వాలియర్‌లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్మృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదనలు రూపొందించారు. దానికి అనుగుణంగా సిరోల్‌ ప్రాంతంలో 10 వేల ఎకరాలు కేటాయించారు. అక్కడే వాజ్‌పేయి స్మృతివనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు మున్సిపల్‌, ఇతర విభాగాలు అనుమతిచ్చాయి. దీనికోసం ఏర్పడిన నజుల్‌ కమిటీ కూడా ఆమోదం తెలపడంతో లైన్‌ క్లియర్‌ అయింది. స్మృతివనానికి అవసరమైన 10వేల ఎకరాల భూమికి పాలనా విభాగం నుంచి పూర్తిగా ఆమోదం లభించినట్లైంది.

డిసెంబర్‌ 25, 1924లో గ్వాలియర్‌లో జన్మించిన వాజ్‌పేయికి కవిత్వం అంటే ఎంతో ఆసక్తి. భారత ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పనిచేసిన వాజ్‌పేయి పేరిట అరుదైన రికార్డులు ఉన్నాయి. ఆయన నాలుగు రాష్ట్రాల్లో 6 లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందిన ఏకైక నేత. బీజేపీని ఉన్నత శిఖరాలకు చేర్చి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 1996లో మొదటిసారి బీజేపీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు 13 రోజులపాటు ప్రధానిగా వాజ్‌పేయి సేవలందించారు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం పడిపోయింది. తిరిగి 1998లో రెండో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 13 నెలలు పాలించారు. మళ్లీ 1999 నుంచి 2004 వరకు వాజ్‌పేయి భారత ప్రధానిగా పనిచేశారు. ఈ సందర్భంలోనే 1998లో పోఖ్రాన్‌ అణుపరీక్ష నిర్వహించారు. 1999లో కార్గిల్ యద్ధంలో పాకిస్థాన్‌పై భారత్‌కు విజయాన్ని అందించారు. వాజ్‌పేయి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Kaushal Kishore | మద్యం తాగేవాళ్లకు పిల్లనివ్వొద్దు, మీ బిడ్డల గొంతు కొయ్యొద్దు.. కన్నీటి పర్యంతమైన కేంద్ర మంత్రి

Gali Janardhan Reddy | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి భారీ షాక్.. సొంత పార్టీ పెట్టిన గాలి జనార్ధన్ రెడ్డి

viral news | ఎన్నికల్లో ఓడిన కోపం మామ తోటపై తీర్చుకుంది.. యువకుడిలో గర్భాశయం.. మహిళ కంట్లోంచి 200 రాళ్లు..

RBI Ex Governor Rangarajan | భారత్ అభివృద్ధి చెందిన దేశం కావాలంటే మరో 20 ఏండ్లు ఆగాల్సిందేనా? ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ కామెంట్స్ ఇవే

Indian Army | భారత్‌లో విధ్వంసానికి పాకిస్థాన్ ప్లాన్.. పోలీసులు, సైన్యం సంయుక్త ఆపరేషన్‌లో కుట్ర భగ్నం

Chandrababu | తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటే నష్టం ఎవరికి ? లాభం ఎవరికి .. చంద్రబాబు ఎత్తుగడ అదేనా!

chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్‌కు భయం.. ఆయన ఉన్న హోటల్‌కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు

Chalapathi rao | నన్నే గుర్తుపట్టరు నువ్వేంత.. చలపతిరావును ఎన్టీఆర్ అలా ఎందుకు అన్నారు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News