Home Latest News JEE Main 2023 Results| జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేశాయి.. ఇలా చెక్ చేసుకోండి

JEE Main 2023 Results| జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేశాయి.. ఇలా చెక్ చేసుకోండి

JEE Main 2023 Results | ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫైనల్ కీని సోమవారం రాత్రి విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) .. తాజాగా మంగళవారం ఉదయం ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఫలితాలను www.jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చని తెలిపింది. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ సూచించింది.

బీటెక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జేఈఈ మెయిన్ 2023 తొలి విడత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 8.60 లక్షల విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 1.60 లక్షల మంది జేఈఈ మెయిన్ పరీక్ష రాశారు. రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 6 నుంచి 12 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Turkey Earthquake | ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భారీ భూకంపాలు ఇవే..

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

Revanth Reddy | ఉద్యోగాలు రావాలంటే మార్పు రావాల్సిందే.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

Ponguleti Srinivas reddy | దమ్ముంటే నన్ను సస్పెండ్‌ చేయండి.. బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి పొంగులేటి సవాల్‌!

Telangana Budget | సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

Exit mobile version