Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsBreaking News | కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత

Breaking News | కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత

Breaking News | జేడీయూ తొలి వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శరద్‌ యాదవ్‌ కూతురు సుభాషిణి యాదవ్‌ ధృవీకరించారు.

1947 జులై 1న మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌ జిల్లాలో జన్మించారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ ఇన్‌స్పిరేషన్‌తో రాజకీయాల్లోకి వచ్చిన శరద్‌ యాదవ్‌ బిహార్‌లో చక్రం తిప్పారు. ఏడుసార్లు లోక్‌సభకు, నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2003లో నితీశ్ కుమార్‌తో కలిసి జేడీయూ పార్టీని స్థాపించాడు. 2014 సాధారణ ఎన్నికల్లో జేడీయూ పార్టీ ఓడిపోవడంతో నితీశ్‌కుమార్‌తో శరద్‌ యాదవ్‌ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ విబేధాలు మరింత ముదరడంతో 2018లో లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ (ఎల్జేడీ )ని స్థాపించాడు. 2022 మార్చిలో రాష్ట్రీయ జనతాదళ్‌ ( ఆర్జేడీ)లో తన ఎల్జేడీని విలీనం చేశాడు.
మూడున్నర దశాబ్దాల తర్వాత తిరిగి లాలూ ప్రసాద్‌తో జట్టు కట్టారు.

  • జనతా పార్టీలో చేరి శరద్‌ యాదవ్‌ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ నియోజకవర్గం నుంచి 1974 ఉప ఎన్నికల్లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.
  • 1979లోనూ జనతా పార్టీ నుంచి జబల్‌పూర్‌ ఎంపీగా గెలిచారు.
  • జనతా పార్టీ విడిపోవడంతో లోక్‌దళ్‌ టికెట్‌పై 1981లో అమేథీ నుంచి పోటీ చేశాడు. కానీ రాజీవ్‌ గాంధీ తొలిసారిగా కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉండటంతో శరద్‌ యాదవ్‌కు ఓటమి తప్పలేదు.
  • 1984లో ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌ నుంచి ఎంపీగా గెలిచారు.
  • 1986లో రాజ్యసభకు ఎన్నికయ్యారు
  • 1991లో బిహార్‌ రాజకీయాల్లోకి వచ్చిన శరద్‌పవార్‌.. మాధేపుర నియోజవర్గం నుంచి 1991, 96, 99, 2009లో ఎంపీగా గెలిచాడు.
  • 2004లో జేడీయూ నుంచి రాజ్యసభకు వెళ్లారు.
  • 2014లో మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు
  • 2016లో నాలుగో సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

India Vs New Zealand Tickets | ఉప్పల్‌ స్టేడియంలో 18న వన్డే మ్యాచ్.. టికెట్ల ధరలు ఎంత ? ఒక్కొక్కరు ఎన్ని టికెట్లు తీసుకోవచ్చు?

Narendra Modi | ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారా ? మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ అందుకేనా?

Telangana chief secretary | తెలంగాణకు తొలి మహిళా సీఎస్ .. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్

Bandi Sanjay | RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. బండి సంజయ్ ను ఆడుకుంటున్న నెటిజన్లు.. ఎందుకంటే..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News