Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsAir India | ఎయిరిండియా మూత్ర విసర్జన కేసులో ఊహించని ట్విస్ట్‌.. ఆమెపైనే శంకర్‌ ఆరోపణలు!

Air India | ఎయిరిండియా మూత్ర విసర్జన కేసులో ఊహించని ట్విస్ట్‌.. ఆమెపైనే శంకర్‌ ఆరోపణలు!

Air India | ఎయిరిండియాలో మహిళపై ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చే ఎయిర్‌ ఇండియా విమానంలో తన తోటి ప్రయాణికురాలి పై మూత్ర విసర్జన చేసినట్లు శంకర్‌ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ కోర్టులో సంచలన విషయాలు చెప్పాడు. ఆరోజు విమానంలో నేను ఆ మహిళ పై మూత్ర విసర్జన చేయలేదని శంకర్ మిశ్రా కోర్టుకు తెలిపాడు. ఆమెనే అలా చేసుకుందని చెప్పాడు. తాను ఏ పాపం ఎరుగనని కోర్టులో వాదించాడు.

అసలు ఆ రోజు విమానంలో ఆమెపై తాను మూత్ర విసర్జన చేయలేదని సెషన్స్‌ న్యాయమూర్తి ఎదుట శుక్రవారం మిశ్రా వాదనకు దిగాడు. మిశ్రాను కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల అభ్యర్థనను మెజిస్టీరియల్‌ కోర్టు తిరస్కరించింది. 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌కు అప్పగించింది. దీంతో పోలీసులు అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి హర్‌ జ్యోత్‌ సింగ్‌ భల్లాను ఆశ్రయించారు.

మిశ్రా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ దీనికి మిశ్రాకి ఎలాంటి సంబంధం లేదని, ఆ మహిళే మూత్ర విసర్జన చేసి ఉండవచ్చని వాదించారు. ” ఆమె ప్రొస్టేట్‌కు సంబంధించిన సమస్యలతో బాధపడుతోంది. ఆ వ్యాధితో బాధపడేవారు ఇలా చేసుకోవడం సహజమే. నేను మాత్రం మూత్ర విసర్జన చేయలేదు. ఆమె కూర్చున్న సీటు వద్దకు కూడా వెళ్లే పరిస్థితి కూడా నాకు లేదు. ఆమె కూర్చున్న సీటు ఎక్కడో మూలన ఉంది. వెనుక నుంచి మాత్రమే ఆమె సీటు వద్దకు వెళ్లొచ్చు. ఒకవేళ నేను అక్కడికి వెళ్లి మూత్ర విసర్జన చేశానని అనుకుంటే, ఆమె వెనుకు సీట్లో కూర్చున్న వ్యక్తి ఫిర్యాదు చేయాలి కదా” అని శంకర్‌ మిశ్రా తన సమాధానంలో పేర్కొన్నాడు.

పోలీసులు ఈ కేసును ఒక జోక్‌ గా తీసుకున్నారని మిశ్రా తరఫు న్యాయవాది అన్నారు. ఘటన జరిగిన మరుసటి రోజు ఆమె ఫిర్యాదు చేశారని, అంతేకాకుండా ఆమె టికెట్‌ డబ్బులు కూడా తిరిగి ఇవ్వాలని ఆమె కోరారని లాయర్‌ తెలిపారు. ఆమె కోరినట్లే ఎయిర్‌ లైన్‌ డబ్బు తిరిగి ఇచ్చిందని కూడా తెలిపారు. తన క్లయింట్ ఏదో పెద్ద నేరం చేసినట్లు ఆయనను అరెస్ట్‌ చేశారని అన్నారు.

ప్రస్తుతం ఉన్న ఉద్యోగం కూడా పోయిందని ఆయన అన్నారు. మిశ్రాను ఇంటరాగేట్‌ చేయాలని కోరుతూ పోలీసులు దరఖాస్తు చేసుకున్న పిటిషన్‌ ను అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి కొట్టివేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kerala Schools | ఇక స్కూళ్లలో సర్‌… మేడమ్ అనాల్సిన అవసరం లేదు… ఓన్లీ టీచర్‌.. ఆదేశాలు జారీ !

Rajashree Swain | ఇద్దరు క్రికెటర్లు మృతి.. అడవిలో అనుమానస్పదంగా మహిళా క్రికెటర్ మృతదేహం.. ఆత్మహత్యా ? హత్యా ?

Weather Report | ఈ శతాబ్దంలో ఇదే అత్యంత చలికాలం.. మరో వారంలో మైనస్ 4 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

Ganga vilas | ప్రధాని మోదీ ప్రారంభించిన గంగా విలాస్ ఎక్కాలంటే 20 లక్షలు ఉండాల్సిందే.. ఈ క్రూయిజ్ స్పెషాలిటీ ఏంటి?

Breaking News | షిర్డీ వెళ్తున్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 10 మంది సాయిబాబా భక్తులు దుర్మరణం

Roja Selvamani | ఆ ఒక్క మాటతో శ్రీకాకుళం జనం జేబులో చేతులు పెట్టుకుని వెళ్లిపోయారు.. పవన్ కళ్యాణ్‌పై రోజా సెటైర్లు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News