Thursday, April 25, 2024
- Advertisment -
HomeNewsInternationalTaliban | ఆడవాళ్లే కాదు వాళ్ల బొమ్మలపైనా ఆంక్షలు విధించిన తాలిబన్లు.. అఫ్ఘానిస్థాన్‌లో అరాచకం

Taliban | ఆడవాళ్లే కాదు వాళ్ల బొమ్మలపైనా ఆంక్షలు విధించిన తాలిబన్లు.. అఫ్ఘానిస్థాన్‌లో అరాచకం

Taliban | ఆఫ్ఘానిస్థాన్‌లో మహిళల హక్కులను కాలరాస్తున్న తాలిబన్లు మరోసారి తమ వివక్షను చూపించారు. ఇప్పటివరకు మహిళలపై కఠిన ఆంక్షలు విధించగా.. ఇప్పుడు వాళ్ల బొమ్మలను కూడా వదలట్లేదు. షాపింగ్ మాల్స్, బట్టల దుకాణాల్లో షో కోసం పెట్టే బొమ్మల మొహాలు కనిపించవద్దని హుకుం జారీ చేశారు. తాలిబన్ల ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ముందు అసలు షాపింగ్ మాల్స్‌, బట్టల దుకాణాల్లో అమ్మాయిల బొమ్మలే లేకుండా చేయాలని తాలిబన్లు నిర్ణయం తీసుకున్నారని ఆఫ్ఘానిస్థాన్‌లోని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తర్వాత వాళ్లు నిర్ణయం మార్చుకున్నారని చెప్పారు. ఆఫ్ఘానిస్థాన్ కాబుల్‌లోని ఓ దుకాణంలో షో కోసం ఉంచిన ఆడవాళ్ల బొమ్మలకు మొహాలు కనబడకుండా చేయాలని ఆదేశించారని తెలిపారు. అందుకే మహిళల బొమ్మల మొహాలు కనిపించకుండా బట్టలు, పాలిథీన్ కవర్లు చుట్టామని పేర్కొన్నారు.

తాలిబన్ల ఆదేశాల మేరకు బొమ్మల మొహాలకు కవర్లు చుట్టిన ఫొటోలను మానవాతవాది సారా వాహేది ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆఫ్ఘానిస్థాన్‌లో మహిళల జీవితం ఎంత దయనీయంగా ఉందో చెప్పేందుకు ఈ ఫొటోలు నిదర్శనమని రాసుకొచ్చారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | గోల్డెన్‌ వీసా అందుకున్న అల్లు అర్జున్‌.. యూఏఈ ఇచ్చే ఈ వీసా ఎందుకంత స్పెషల్‌?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News