Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsInternationalLayoff | ఇంటర్వ్యూ చేస్తుండగానే హెచ్ఆర్ ఉద్యోగం ఔట్.. గూగుల్‌లో లే ఆఫ్‌ ఎఫెక్ట్!

Layoff | ఇంటర్వ్యూ చేస్తుండగానే హెచ్ఆర్ ఉద్యోగం ఔట్.. గూగుల్‌లో లే ఆఫ్‌ ఎఫెక్ట్!

Layoff | కొద్దిరోజులుగా ప్రముఖ టెక్‌ కంపెనీలన్ని కూడా తమ ఉద్యోగులకు ఊహించని షాక్‌‌లు ఇస్తున్నాయి. గూగుల్‌లో ఉన్నత పదవిలో ఉన్న ఉద్యోగిని తీసేసిన తర్వాత ఆయనకు చాలా సమయం వరకు తెలియలేదు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఉద్యోగం తీసేయడంతో అతని పరిస్థితి అగమ్యగోచరంగా తయారైయ్యింది.

అసలేం జరిగిందంటే… డాన్‌ లానిగన్‌ ర్యాన్‌ అనే వ్యక్తి గూగుల్‌ సంస్థలో హెచ్‌ఆర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను సంస్థలోకి మరో వ్యక్తిని తీసుకునేందుకు ఇంటర్య్వూ చేస్తుండగా సడెన్‌గా సంస్థ అతనికి ఇచ్చిన సౌకర్యాలన్ని ఆగిపోయాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడు. అతనితో పాటు మరికొందరు కూడా లాగిన్‌ కాలేకపోయారు. టెక్నికల్‌ ఇష్యూ అయ్యి ఉంటుందని అందరూ భావించారు. కానీ సంస్థ నుంచి మెయిల్‌ వచ్చాక కానీ అసలు విషయం అర్థం కాలేదు. తనను జాబ్‌లో నుంచి తీసేశారని తెలిసి షాక్ అయ్యాడు.

” కంపెనీ వెబ్‌ సైట్‌ యాక్సెస్‌ కోల్పోయినప్పుడే నా ఈ మెయిల్‌ను కూడా బ్లాక్‌ చేశారు. క్యాండిడేట్‌తో జరుగుతున్న ఇంటర్వ్యూ కాల్‌ను కూడా ఆపేశారు. తరువాత 20 నిమిషాలకు న్యూస్‌లో ఓ ప్రకటన వచ్చింది. ఏంటంటే… గూగుల్‌ నుంచి 12 వేల మందిని తొలగించారని దాని సారాంశం.

గూగుల్‌లో ఉద్యోగం చేయడం నా కల. కేవలం ఏడాది కిందటే నాకు జాబ్‌ వచ్చింది. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. లే ఆఫ్‌ ప్రభావం నా పైనా పడింది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు” అంటూ లింక్డ్‌ ఇన్‌ లో ర్యాన్‌ పోస్ట్‌ పెట్టాడు.

ఈ మధ్యే ఏకంగా 12 వేల మందిని గూగుల్‌ తొలగించింది. ఈ లే ఆఫ్స్‌ విషయంలో మొత్తం బాధ్యత తానే తీసుకుంటానని కంపెనీ సీఈవో పిచయ్‌ చెప్పారు. ఉద్యోగాలు పోయినవారందరికీ ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kodali Nani | నందమూరి వారసులకు భయపడే నారా లోకేశ్ పాదయాత్ర.. యువగళంపై కొడాలి నాని కౌంటర్

Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌కు.. కేఏ పాల్‌కు పెద్ద తేడా లేదు.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్

Vishnu Priya | యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు

TTD | అరచేతిలో వైకుంఠనాథుడి విశేషాలు.. మొబైల్‌లో ఒక్క క్లిక్‌తోనే శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News