Home Entertainment KL Rahul-Athiya Shetty | ఘనంగా అతియా-కేఎల్ రాహుల్ వివాహం.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన సల్మాన్,...

KL Rahul-Athiya Shetty | ఘనంగా అతియా-కేఎల్ రాహుల్ వివాహం.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన సల్మాన్, కోహ్లీ, ధోనీ

Image Source: KL Rahul Facebook

KL Rahul-Athiya Shetty | అతిథులు, కుటుంబ సభ్యుల మధ్య భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియాశెట్టి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి ఫొటోలు వైరల్‌‌గా మారడంతో నెటిజన్లు వీరిద్దరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరి వివాహానికి కొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అతిథులుగా వచ్చిన వారు తెచ్చిన బహుమతులు చూసి అక్కడున్న వారు సైతం షాకయ్యారట. నెట్టింట ఇప్పుడిదే ట్రెండింగ్‌లో ఉంది. రాహుల్, అతియా పెళ్లికి ఎవరు హాజరయ్యారు ఏం బహుతులు తెచ్చారనే డిస్కషన్ నడుస్తోంది.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన కుమార్తెకు పెళ్లి బహుమతిగా ముంబైలోని అత్యంత విలాసవంతమైన ఫ్లాటును బహుమతిగా ఇచ్చారట. దీని విలువ రూ. 50 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇక పెళ్లికి వచ్చిన సునీల్ శెట్టి క్లోజ్ ఫ్రెండ్ సల్మాన్ కూడా అతియా-రాహుల్ జంటకు రూ.1.64 కోట్ల విలువైన ఆడీ కారును బహుమతిగా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

అటు జాకీష్రాఫ్ కూడా రూ.30 లక్షల విలువైన వాచ్‌ను అతియాకు బహుమతిగా ఇచ్చాడట. అర్జున్ కపూర్ కూడా ఖరీదైన బహుమతి ఇచ్చాడని టాక్. అటు కేఎల్ రాహుల్‌కు కూడా విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని ఖరీదైన బహుమతులే ఇచ్చారట. కోహ్లీ బీఎండబ్ల్యూ కారును, ధోనీ ఖరీదైన కవాసకి నింజా బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారని వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇక అతియా, రాహుల్ ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ పార్టీ ఇవ్వబోతున్నట్లు సునీల్ శెట్టి మీడియాతో తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Padma Awards | పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. చిన్న జీయర్‌ సహా 12 మంది తెలుగు వాళ్లకు పద్మ పురస్కారాలు

Uorfi Javed | నాలాంటి సింగిల్స్‌కు ముంబైలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టమైపోయింది.. బిగ్‌బాస్‌ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ ఆవేదన

Women’s IPL | పురుషుల ఐపీఎల్‌ను మించిపోయిన మహిళల లీగ్‌.. రికార్డు ధరకు వేలం

Cholesterol | చెడు కొలెస్ట్రాల్‌కి మంచి కొలెస్ట్రాల్‌కి తేడా ఏంటి.. ? చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి?

Republic Day | రిపబ్లిక్ డే సందర్భంగా 901 మందికి పోలీసు పతకాలు ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారంటే..

Ritu Chowdary | ఫొటో దిగినప్పుడు అనుకోలేదు.. ఇదే చివరి ఫొటో అవుతుందని.. కన్నీళ్లు పెట్టిస్తున్న రీతూ చౌదరి పోస్టు

Exit mobile version