Home Latest News Karnataka | ప్రతి గృహిణికి నెలకు రూ.2వేలు ఇస్తాం.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరాల...

Karnataka | ప్రతి గృహిణికి నెలకు రూ.2వేలు ఇస్తాం.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరాల జల్లు

Karnataka | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న వేళ రాజకీయ పార్టీలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటకలోనూ అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓటర్లను మభ్యపెట్టేందుకు హామీలు కురిపిస్తోంది. ఈ క్రమంలోనే గృహలక్ష్మీ పథకాన్ని ప్రకటించింది.

తాము అధికారంలోకి వస్తే కనుక గృహలక్ష్మీ యోజన కింద గృహిణులకు ప్రతి నెల రూ.2000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలోనే గృహలక్ష్మీ పథకాన్ని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ శివకుమార్ ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ.24వేలు నేరుగా గృహిణుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. వంట గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలతో గృహిణుల ఖర్చు పెరుగుతుండటంతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌ పలు హామీలను కురిపించింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికీ నెల నెలా 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే ఈ పథకాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌లో అమలు చేస్తోంది. దాంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తాము కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొంది. దీని గురించి బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్‌ హామీలు నీటి మీద రాతలే అవుతాయని చెప్పింది. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని బీజేపీ నేతలు కోరుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం

nepal plane crash | నేపాల్‌లో విమానం కూలింది ఇలా.. ప్రమాదం జరిగే ముందు ఫేస్‌బుక్‌ లైవ్ పెట్టిన యూపీ యువకులు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునే.. కానీ ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను.. నాగబాబుపై ఏపీ మంత్రి అంబటి సెటైర్లు

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

Kodi pandalu | ఏపీలో దారుణం.. ఇద్దరి ప్రాణాలు తీసిన కోడి కత్తి.. కోడి పందాలు చూస్తుండగా ఘటన

Exit mobile version