Home News AP Kanna Lakshminarayana | బీజేపీని వీడేముందు ప్రధాని మోదీపై కన్నా లక్ష్మీనారాయణ సెన్సేషనల్ కామెంట్స్.. జీవీఎల్...

Kanna Lakshminarayana | బీజేపీని వీడేముందు ప్రధాని మోదీపై కన్నా లక్ష్మీనారాయణ సెన్సేషనల్ కామెంట్స్.. జీవీఎల్ రియాక్షన్ ఇదీ

Kanna Lakshminarayana | ఏపీలో కాషాయ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. గుంటూరుతో తన అనుచరులతో సమావేశం అనంతరం.. పార్టీని వీడుతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఆయనతో పాటు తన అనుచరులు కూడా బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారని వెల్లడించారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించినట్లు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితుడినై బీజేపీలో చేరానని.. అప్పట్నుంచి సామాన్య కార్యకర్తగా పనిచేశానని కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. తన పనితీరును గుర్తించే అధిష్ఠానం తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిందని గుర్తు చేశారు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రవర్తన కారణంగానే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని ఆక్ష్న తెలిపారు. పార్టీని తన సొంత సంస్థలా నడుపుతున్నాడని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావుపై కూడా కన్నా విమర్శలు గుప్పించారు. ఓవర్ నైట్ లీడర్ కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీపై తనకు ఉన్న అభిమానం ఎప్పటికీ చెక్కు చెదరదని ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యచరణనను ప్రకటిస్తానని తెలిపారు.

టీడీపీలో చేరే ఛాన్స్ !

సోము వీర్రాజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైనప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వంపై కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తిగానే ఉన్నారు. అందుకే ముందు నుంచి సోము వీర్రాజుపై కన్నా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆయన వల్లే పార్టీ ఎదగడం లేదని కూడా గతంలో పలుమార్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సైతం కన్నా గైర్హాజరు అయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు కూడా ఆయన్ను కలవడానికి కన్నా వెళ్లలేదు. దీంతో కన్నా బీజేపీని వీడబోతున్నారనే ప్రచారం మొదలైంది. టీడీపీ లేదా జనసేనలోకి కన్నా వెళ్లే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సోము వీర్రాజు టీడీపీలోనే చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23 లేదా 24వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంతో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం.

రాజకీయ దురద్దేశంతోనే రాజీనామా

కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడటాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తప్పుబట్టారు. కన్నాకు బీజేపీ సముచిత గౌరవం కల్పించిందని.. అయినా ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. రాజకీయ దురుద్దేశంతో కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అధిష్ఠానం చెప్పిన విధంగానే సోము వీర్రాజు నడుచుకున్నారని.. ఆయన వ్యక్తిగతంగా ఏ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎంపీగా తన బాధ్యతలకు లోబడే తాను పనిచేశానని పేర్కొన్నారు.

Exit mobile version