Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsKamareddy Master Plan | కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. రైతుల ఆందోళనకు తలొగ్గిన...

Kamareddy Master Plan | కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. రైతుల ఆందోళనకు తలొగ్గిన సర్కార్

Kamareddy Master Plan | కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్లు రద్దు చేస్తూ మున్సిపల్ పాలకవర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. మాస్టర్ ప్లాన్‌పై అత్యవసరంగా సమావేశమైన మున్సిపల్ కౌన్సిల్స్.. పాత డ్రాఫ్ట్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రైతుల ఆందోళనతో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా రైతులు ఆందోళన విరమించాలని పాలకవర్గాలు విజ్ఞప్తి చేశాయి.

కామారెడ్డిలో కౌన్సిలర్ల రాజీనామాలు, ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడి నేపథ్యంలో కామారెడ్డి మున్సిపల్ అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి ప్రకటన విడుదల చేశారు. ముసాయిదా తయారు చేసిన డిజైన్ డెవలప్ మెంట్ ఫోరం, డీటీసీపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తీర్మానం కాపీతో పాటు కొత్త మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వానికి పంపారు. మాస్టర్ ప్లాన్‌లో తప్పులు ఉన్నందునే గతంలో తిరస్కరించామని అన్నారు. కావాలనే ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. విలీన గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండస్ట్రియల్ జోన్‌లో చేర్చమని తెలిపారు. అటు జగిత్యాల మాస్టర్ ప్లాన్‌ను కూడా రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌పై ప్రతిపక్షాలు కావాలనే రైతులను తప్పు దోవ పట్టిస్తున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. ముసాయిదాపై 60 రోజుల పాటు రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించామని, ఆలోపే రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించాయదని అన్నారు. ప్రస్తుతం కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్లను రద్దు చేస్తూ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. ఇకపై రైతులకు సంబంధించిన ఇంచు భూమి కూడా పోదని, ఆందోళన విరమించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు. ఇండస్ట్రియల్ జోన్‌ రెసిడెన్షియల్ జోన్‌గానే ఉంటుందని తెలిపారు. రైతులను ఇబ్బందులకు గురిచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు.

కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని గత కొద్ది రోజులుగా రైతులు ఆందోళన చేశారు. రైతులకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. ఆందోళనలో పాల్గొన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి ఘటన సంచలనంగా మారింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Priya Bhavani Shankar | డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా.. అయితే ఏంటి.. మీడియాపై హీరోయిన్‌ విసుర్లు

Rashmika Mandanna | డైరెక్టర్ దెబ్బకు దిగొచ్చిన రష్మిక.. వాళ్ల వల్లే ఇక్కడ ఉన్నానంటూ పొగడ్తలు

Jacqueline Fernandez | అతను నా జీవితాన్ని నాశనం చేశాడు.. నరకంలో పడేశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్

Jabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్

Quelea Birds | బుల్లి పిట్టలపై కెన్యా యుద్ధం.. ఆరు లక్షల పక్షులను చంపడమే టార్గెట్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News