Thursday, April 25, 2024
- Advertisment -
HomeNewsAPAP Movie Tickets | వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా నిర్మాతలకు గుడ్ న్యూస్.. ప్రేక్షకులకు...

AP Movie Tickets | వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా నిర్మాతలకు గుడ్ న్యూస్.. ప్రేక్షకులకు షాక్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

AP Movie Tickets | సంక్రాంతి బరిలో నిలిచిన వాల్తేరు వీరయ్య ( Waltair veerayya ), వీరసింహారెడ్డి ( Veerasimhareddy ) సినిమాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చాలా రోజుల తర్వాత టికెట్ ధరలను పెంచుకునేందుకు జగన్ సర్కార్ అనుమతినిచ్చింది.

చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సంక్రాంతి పండక్కి బాక్సాఫీస్ దగ్గర తలపడుతుండటంతో వీటిపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్‌కు మంచి టాక్ రావడంతో రెండు సినిమాలపై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతించాలని రెండు సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది. రూ.70 వరకు పెంచుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ కోరినట్టు రూ.70 కాకుండా రూ.40 వరకు గరిష్ఠంగా పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. వాల్తేరు వీరయ్య సినిమాకు గరిష్ఠంగా రూ.25, వీరసింహారెడ్డి సినిమాకు గరిష్ఠంగా రూ.20 పెంచుకోవచ్చని తెలిపింది. సినిమా విడుదలైన తొలి 10 రోజులు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కూడా చిరంజీవి, బాలయ్య సినిమాలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు చిత్రాలకు స్పెషల్ షోలకు అనుమతినిచ్చింది. సినిమా రిలీజ్ రోజున ఆరు షోలు వేసుకోవచ్చని తెలిపింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే అదనపు షోలు వేసుకోవచ్చని స్పష్టం చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

varisu vs thunivu | ఇదేం అరాచకం.. చెన్నైలో థియేటర్ ముందే తన్నుకున్న విజయ్, అజిత్ ఫ్యాన్స్

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

Oscars 2023 | సైలెంట్‌గా ఆస్కార్ బరిలోకి నిలిచిన కాంతార.. సౌత్ నుంచి ఇంకా ఏ సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News