Friday, March 29, 2024
- Advertisment -
HomeNewsInternationalTwitter Down | మరోసారి ట్విట్టర్‌ సర్వర్‌ డౌన్‌.. భారత్‌లో నిలిచిన సేవలు.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

Twitter Down | మరోసారి ట్విట్టర్‌ సర్వర్‌ డౌన్‌.. భారత్‌లో నిలిచిన సేవలు.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

Twitter Down | ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. భారతీయ కాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ట్విట్టర్‌ సరిగ్గా పనిచేయడం లేదు. ట్విట్టర్‌ పేజీ ఓపెన్‌ కావడంలో చాలామంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెబ్‌ పేజీలతో పాటు ట్విట్టర్‌ మొబైల్‌ యాప్‌లో కూడా లోడింగ్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో ట్విట్టర్‌ సరిగ్గా పనిచేయడం లేదంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. సాయంత్ర 07:04 గంటల సమయానికి డౌన్‌ డిటెక్టర్‌లో 2800కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల్లో 61 శాతం మొబైల్‌ యాప్‌నకు సంబంధించినవి కాగా.. 37 శాతం వెబ్‌పేజీ గురించి కంప్లయింట్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో తరచూ ట్విట్టర్‌ మొరాయించడం జరుగుతూనే ఉంది. ట్విట్టర్‌ను చేతిలోకి తీసుకున్న తర్వాత ఎలన్‌ మస్క్‌ చాలామంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు ఏర్పడి ట్విట్టర్‌లో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కూడా అదే సమస్య వల్ల ట్విట్టర్‌ సేవలకు అంతరాయం కలిగినట్టు చెబుతున్నారు. కాగా, బ్లూ టిక్‌ పెయిడ్‌ సర్వీసులను ట్విట్టర్‌ రేపట్నుంచే తిరిగి అందుబాటులోకి తీసుకొస్తుంది. ట్విట్టర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ కొనుగోలు చేయడానికి యూజర్లకు అనుమతిస్తున్నట్టు పేర్కొంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Aadhar Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Whatsapp Deleted Messages | వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను ఇలా చూడొచ్చు

Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News