Home News International Turkey Earthquake | ఒకవైపు వరుస భూకంపాలు.. మరోవైపు సునామీ.. తుర్కియే, సిరియాలపై ప్రకృతి విలయతాండవం.....

Turkey Earthquake | ఒకవైపు వరుస భూకంపాలు.. మరోవైపు సునామీ.. తుర్కియే, సిరియాలపై ప్రకృతి విలయతాండవం.. మృతుల సంఖ్య 10వేలకు చేరే ఛాన్స్‌

Turkey Earthquake | వరుసగా రెండు భూకంపాలతో అల్లకల్లోలంగా మారిన తుర్కియే, సిరియా దేశాలపై ప్రకృతి మరోసారి విరుచుకుపడింది. ఇప్పటికే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ప్రజలను మరో భూకంపం వణికించింది. రిక్టర్‌ స్కేలుపై 7.6 భూకంప తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఇవి కాకుండా 30కి పైగా భూప్రకంపనలు వచ్చాయి. మరోవైపు తీర ప్రాంతాలను సునామీ చుట్టుముట్టేసింది. దీంతో తిర్కియే, సిరియాల్లో భయానక వాతావరణం నెలకొంది. ప్రకృతి విలయ తాండవం వల్ల 1600మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

భూకంపధాటికి టర్కీలో 912 మంది మరణించారని టర్కీ అధ్యక్షుడు ఎర్డగోన్‌ వెల్లడించారు. సిరియాలో 700 మందికి పైగా సజీవ సమాధి అయ్యారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య 10వేల వరకు పెరిగే అవకాశం ఉందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే అంచనా వేస్తుంది. భూ ప్రకంపనల కారణంగా పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలుతున్నాయి. ఒక్క టర్కీలోనే 2818కి పైగా భవనాలు నేలమట్టమైనట్లు అధికారులు చెబుతున్నారు. పేకమేడల్లా భవనాలు కూలుతున్న దృశ్యాలు.. భూప్రకంపలకు భయపడి జనాలు పరుగులు పెడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Telangana Budget | సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

Turkey Earthquake | తుర్కియే, సిరియా దేశాల్లో ప్రకృతి విలయతాండవం.. భూకంప ధాటికి 640 మందికి పైగా సజీవ సమాధి

Allu Aravind | ఆమెకు ఆ అవసరం లేదు.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిపై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Telangana Budget 2023-24 | 2 లక్షల 90 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన హరీశ్‌ రావు

Yamini Sharma | ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గుంజుడే గుంజుడు.. యామినీ శర్మ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version