Home News International TANA | జులై 7 నుంచి తానా 23వ మహాసభలు.. అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి...

TANA | జులై 7 నుంచి తానా 23వ మహాసభలు.. అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి నేతృత్వంలో మహాసభల నిర్వహణ కమిటీ

TANA | ప్రవాస తెలుగు సంఘాల్లో మొట్ట మొదటిది తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా ( తానా ). ప్రతి ఏటా తానా నిర్వహించే మహాసభలు అంటే ప్రవాసీయులకు పండగే. స్వదేశానికి దూరంగా అమెరికాలో జీవిస్తున్న తెలుగు వారందరినీ ఒక్కచోటే చేర్చేందుకు ఇదో చక్కటి వేడుకగా పనిచేస్తుంది. రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన తానా మహాసభలకు

ప్రవాస తెలుగు సంఘాల్లో ఘన చరిత్ర కలిగినది తానా. అదే తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన తానా.. తెలుగు జాతి ఖ్యాతిని, సంస్కృతి సంప్రదాయాలను ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలకు చేరువగా ఉంచేందుకు ప్రతి ఏటా మహాసభలను నిర్వహిస్తుంది. ఈ తానా మహాసభలు అంటే ప్రవాస తెలుగువారందరికీ పండగే. స్వదేశానికి దూరంగా అమెరికాలో జీవిస్తున్న తెలుగు వారందర్నీ ఒక్క చోట చేర్చేందుకు ఈ మహాసభలు ఎంతగానో దోహదం చేస్తుంటాయి. అందుకే వీటికి ఆదరణ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా 2021లో తానా మహాసభలకు అంతరాయం ఏర్పడింది. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఈసారి మాత్రం మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తానా సిద్ధమైంది. ఈ క్రమంలోనే తానా మహాసభల తేదీలను కూడా ప్రకటించింది.

ఈ ఏడాది జులై 7వ తేదీ నుంచి జులై 9వ తేదీ వరకు ఫిలడెల్ఫియా నగరంలో 23వ తానా మహాసభలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పెన్విల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ మహాసభలను నిర్వహించినున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం కాలేజీవిల్‌ నగరంలోని కమ్యూనిటీ మ్యూజిక్‌ స్కూల్‌ ఆడిటోరియంలో జనవరి 22న నిర్వహించిన కార్యక్రమంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో మహాసభల సమన్వయ కర్త రవి పొట్లూరి నేతృత్వంలో ఈ మహాసభల సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఆసక్తి గల వారి వివరాలను నమోదు చేసుకుని వారికి కూడా బాధ్యతలు కేటాయించారు. మహాసభల కార్యదర్శిగా సతీశ్‌ తుమ్మల, కోశాధికారిగా భరత్‌ మద్దినేని, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా రవి మందలపు, ఇండియా వ్యవహారాల డైరెక్టర్‌గా వంశీ కోట, జాయింట్‌ సెక్రటరీగా శ్రీనివాస్‌ కూకట్ల కు బాధ్యతలను అప్పగించారు.

Exit mobile version