Home Entertainment Oscars 2023 | ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి ఆస్కార్‌లో ఎదురుదెబ్బ.. తెరవెనుక అమెరికా ?

Oscars 2023 | ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి ఆస్కార్‌లో ఎదురుదెబ్బ.. తెరవెనుక అమెరికా ?

Oscars 2023 | ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభించి ఏడాది గడిచింది. దాడి ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అంతర్జాతీయ వేదికలపై దాని గురించి ప్రసంగిస్తూనే ఉన్నారు. తమ దేశం పడుతున్న కష్టాల గురించి ఇంకా ఎక్కువ మందికి తీసుకెళ్లాలనుకున్నారు. అందుకు గానూ ఆయన ఈసారి ఆస్కార్ వేదికను ఎంచుకున్నారు.

కానీ ఆయన కల మాత్రం నెరవేరలేదని తెలుస్తుంది. ఈ విషయంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి ఆస్కార్‌ నిర్వాహకుల నుంచి గట్టి షాకే తగిలింది. వేదిక మీద జెలెన్‌ స్కీ మాట్లాడేందుకు అనుమతి లభించలేదని అమెరికన్ మీడియా సంస్థ వెల్లడించింది. ఆయనకు ఈ అనుభవం ఎదురవడం రెండోసారి. ఈసారి వేడుకల్లో ప్రసంగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ అకాడమీ బృందానికి అభ్యర్థన రాగా.. అది తిరస్కరణకు గురైంది.

అయితే దాని గురించి మీడియాను ప్రశ్నించగా అకాడమీ బృందం స్పందించలేదు. అమెరికా నుంచి ఉక్రెయిన్‌ కి ఆదరణ తగ్గుతున్న తరుణంలో ఈ పరిణామం జరగడం గమనార్హం. 2022 ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తోంది. దీని గురించి ఎన్నో వేదికల మీద జెలెన్‌ స్కీ ప్రసంగించారు.

గత సంవత్సరం జరిగిన 64 వ గ్రామీ వేడుకల్లోనూ ఆయన వర్చువల్ గా మాట్లాడారు. ఇప్పటికే అమెరికాలో 95వ ఆస్కార్‌ వేడుకల సందడి నెలకొంది. మార్చి 12న లాస్‌ ఏంజెల్స్‌ లోని డాల్బీ థియేటర్ లో ఈ వేడుక జరగనుంది. మార్చి 13 ఉదయం ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Exit mobile version