Thursday, April 18, 2024
- Advertisment -
HomeLifestyleHealthWorlds Largest outbreak | ఒక్కరోజే 3.7 కోట్ల కరోనా కేసులు.. చైనాలోకల్లోలం సృష్టిస్తున్న కరోనా

Worlds Largest outbreak | ఒక్కరోజే 3.7 కోట్ల కరోనా కేసులు.. చైనాలోకల్లోలం సృష్టిస్తున్న కరోనా

Worlds Largest outbreak | చైనాలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఎఫ్‌.7 వాయు వేగంతో విస్తరిస్తోంది. ఈ నెల 20న కనీవినీ ఎరగని స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 3.7 కోట్ల మంది కరోనా బారినపడ్డట్లు చైనా అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఒక్కరోజులో ఇంత భారీగా కేసులో ఒక దేశంలో నమోదవడం ఇదే రికార్డు అని చెబుతున్నారు. ఇంకా ఎక్కువే కేసులు నమోదై ఉండొచ్చన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 4 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. వాటి తర్వాత ఒకే రోజు అత్యధికంగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

చైనా రాజధాని బీజింగ్‌, సిచువాన్‌ ప్రావిన్స్‌లో సగానికిపైగా జనాభాకు కరోనా సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనా నేషనల్ హెల్త్‌ కమిషన్‌ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ ద్వారా ఈ విషయం బయటకు వచ్చినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ఈ నెల 20న నమోదైన కేసులు 3.7 కోట్లు కాగా చైనా ప్రభుత్వం అధికారికంగా 3,049 కేసులు మాత్రమే నమోదైనట్లు ప్రకటన విడుదల చేసిందని దుయ్యబట్టింది. మరణాలు సంఖ్య మాత్రం ఆ మినిట్స్‌లో లేవని తెలిపింది.

చైనాలో కరోనా విజృంభన చూసిన ప్రపంచ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణీకులపై కూడా దృష్టి సారించాయి. భారత్‌లో కూడా అత్యున్నత సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాలు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, ఆస్పత్రల్ల్లో సదుపాయాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, బెడ్ల కొరత లేకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రజలకు కూడా పలు సూచనలు చేశారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని, పండుగల వేళ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Omicron BF.7 | చైనాలో రోజుకు 10 లక్షల కేసులు, 5 వేల మరణాలు. లండన్ సంస్థ నివేదికలో సంచలన విషయాలు

Bharat Biotech Nasal vaccine | కరోనా విలయతాండవం చేస్తున్న వేళ గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

PM Modi meeting on corona | కరోనాపై ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం.. ముప్పు తొలగిపోలేదు.. జాగ్రత్తగా ఉండాల్సిందేనని సూచన

Harish Rao | ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌.. హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష

Covid situation in china | చైనాలో పరిస్థితి అంత దారుణంగా ఉందా? కరోనా అంతమయ్యేది ఎప్పుడు.. నిపుణుల అభిప్రాయమిదే!

Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ BF.7 లక్షణాలివే..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News