Home News International Viral News | విమాన టికెట్ కొనాల్సి వస్తుందని కన్నబిడ్డనే వదిలి వెళ్లడానికి సిద్ధమైన తల్లిదండ్రులు.....

Viral News | విమాన టికెట్ కొనాల్సి వస్తుందని కన్నబిడ్డనే వదిలి వెళ్లడానికి సిద్ధమైన తల్లిదండ్రులు.. దారుణం!

Viral News | తమ బిడ్డకు విమాన టికెట్‌ కొనాల్సి వస్తుందని ఓ జంట ఏకంగా తమ భుజాన ఉన్న బిడ్డనే వదిలి వెళ్లడానికి సిద్ధపడ్డారు. ఇజ్రాయెల్‌లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఎయిర్‌ పోర్ట్ అథారిటీ వెంటనే అలర్ట్ అవ్వడంతో వారిని అడ్డుకున్నారు.

ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్‌ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఓ జంట తమ బిడ్డను చెక్ ఇన్ కౌంటర్‌ వద్ద వదిలి పెట్టి దేశం నుంచి పారిపోవడానికి ప్రయత్నించడం అధికారులను షాక్‌కు గురిచేసింది. బెల్జియం పాస్‌ పోర్ట్‌ను కలిగి ఉన్న ఓ జంట..ఇజ్రాయెల్ నుంచి ర్యాన్ ఎయిర్‌ విమానంలో బ్రస్సెల్స్‌కు వెళ్లడానికి వచ్చారు. వారు తమ సంవత్సరం వయసున్న మగబిడ కోసం టిక్కెట్‌ కొనలేదు. పిల్లలతో ప్రయాణించే వ్యక్తులు ల్యాప్ సీటు కోసం సుమారు 25 డాలర్లు చెల్లించాలి. లేదా ర్యాన్‌ ఎయిర్‌ ప్రామాణిక ఛార్జీల ప్రకారం ప్రత్యేక సీటును కొనుగోలు చేయాలి.

విమానాశ్రయానికి కూడా వారు ఆలస్యంగానే వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. చెక్‌-ఇన్‌ కౌంటర్లు మూసేసిన తరువాత టెర్మినల్ 1కి ఆలస్యంగా చేరుకున్నారు. అక్కడ సిబ్బంది వారిని టికెట్లు అడిగారు. అయితే వారు 2 టికెట్లు మాత్రమే చూపించారు. బిడ్డకు టికెట్‌ కొనలేదు. భద్రత సిబ్బంది చిన్నారికి కూడా టికెట్‌ అడగగా వారు బిడ్డను క్యారియర్‌ లో శిశువును వదిలి వెళ్లడానికి ప్రయత్నించారు.

బిడ్డకు టికెట్‌ కొనకపోగా సిబ్బందితో గొడవకు దిగారు. ఆ తర్వాత చిన్నారిని అక్కడే వదిలేసి.. హడావిడిగా విమానం వైపు వెళ్లిపోవడానికి ప్రయత్నించగా భద్రత సిబ్బంది వెంటనే అలర్ట్ అయి భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆ దంపతులను సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. అదుపులోనికి తీసుకున్నారు. ఈ ఘటన జనవరి 31వ తేదీన ఇజ్రాయెల్ లో చోటు చేసుకుంది.

25 డాలర్ల విమాన టికెట్ కోసం ఏకంగా బిడ్డనే వదిలి వెళ్లడానికి సిద్ధపడిన జంట గురించి సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. దీని గురించి తెలిసిన వారంతా ఇలాంటి వారు కూడా ఉంటారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | బాల భీముడు.. భలే ముద్దొస్తున్నాడుగా.. 8 కేజీల బరువుతో శిశువు జననం

Queen Elizabeth II | కరెన్సీ నోట్లపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగింపు.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Vistara | విమాన సిబ్బందిని తిట్టి.. అర్థనగ్నంగా నడిచిన ప్రయాణికురాలు.. ఆ తర్వాత ఏమైంది?

Indian Economy | 50 శాతం వాటా ఇండియా, చైనాదే అవుతోంది.. ఐఎంఎఫ్‌ కీలక వ్యాఖ్యలు

China | పెళ్లి చేసుకోకున్నా సరే పిల్లల్ని కనండి.. అన్ని బెనిఫిట్స్ ఇస్తామని ప్రోత్సహిస్తున్న చైనా

Exit mobile version