Home News International Putin | రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అరెస్టు వారెంట్

Putin | రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అరెస్టు వారెంట్

Putin | రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీసీ ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ నుంచి రష్యాకు చట్టవిరుద్ధంగా పిల్లలను పంపించడంతో పాటు పలు యుద్ధ నేరాల కింద పుతిన్‌ను బాధ్యుడు అని ఐసీసీ పేర్కొంది. రష్యా సైనిక దళాల దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో నేరాలు పెరిగాయని చెప్పింది. రష్యా చిల్డ్రన్ రైట్స్ కమిషనర్ మారియా లోవా బెలోవాకు కూడా అరెస్టు వారెంట్ జారీ చేసింది.

ఉక్రెయిన్‌లోని పిల్లలను అన్యాయంగా పంపడంలో పుతిన్‌ ప్రమేయం ఉందని ఐసీసీ అభియోగాలు మోపింది. అంతేకాకుండా నేరుగా ఈ చర్యలకు పాల్పడ్డాడని, పిల్లలను అక్రమంగా రవాణా చేసే వారిని ఆపేందుకు తన హక్కులను వినియోగించుకోవడంలో పుతిన్ విఫలమయ్యాడని కోర్టు పేర్కొంది. ఐసీసీ ఇచ్చిన తీర్పును ఉక్రెయిన్ స్వాగతించింది. ఈ నిర్ణయం ఉక్రెయిన్‌తో పాటు మొత్తం అంతర్జాతీయ న్యాయ వ్యవస్థకు చారిత్రాత్మకం అని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆండ్రీ కోస్టిన్ అన్నారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్ష చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యెర్మాక్ ఈ నిర్ణయం ప్రారంభం మాత్రమే అని ప్రశంసించారు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ అంతర్జాతీయ రాజకీయాల్లో లెక్చరర్ అయిన జోనాథన్ లీడర్ మేనార్డ్ మాట్లాడుతూ పుతిన్‌పై అభియోగాలు మోపడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. అయితే రష్యా మాత్రం దీన్ని ఖండించింది.

పుతిన్‌కు అరెస్ట్ వారెంట్లు అర్థరహితమని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయాలతో తమ దేశానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఎందుకంటే వారెంట్లు ఉన్నప్పటికీ అనుమానితులను అరెస్టు చేసే అధికారాలు ఐసీసీకి లేవని స్పష్టం చేశారు. దాని ఒప్పందానికి సంతకం చేసిన దేశాలలో మాత్రమే అధికార పరిధిని అమలు చేయగలదని తెలిపారు. ఆ ఒప్పందంపై రష్యా సంతకం చేసిన దేశం కాదు కాబట్టి అరెస్టు వారెంట్లు ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. ఆ సందేశాన్ని జఖరోవా పునరుద్ఘాటించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | అత్తారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను పుట్టింటికి వెళ్లిపోతా.. పెళ్లయిన కాసేపటికే వరుడికి షాకిచ్చిన వధువు

Naveen Murder Case | నవీన్‌ మర్డర్‌ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల

Naatu Naatu | నాటు నాటు పెడితే కానీ.. నా కొడుకు అన్నం తినడం లేదు.. కరీనా కపూర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

Exit mobile version