Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsVivek Express | వందేభారత్‌ను మించిన వివేక్ ఎక్స్‌ప్రెస్ వచ్చేస్తోంది.. దీనికి మాత్రమే ఈ రికార్డు...

Vivek Express | వందేభారత్‌ను మించిన వివేక్ ఎక్స్‌ప్రెస్ వచ్చేస్తోంది.. దీనికి మాత్రమే ఈ రికార్డు సొంతం !

Vivek Express | ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే శాఖ ఎప్పటికప్పుడు మార్పులు చేపడుతోంది. తొందరగా గమ్యస్థానాలకు తీసుకెళ్లడానికి వందే భారత్ వంటి రైళ్లను తీసుకొస్తున్నాయి. 14 గంటల సమయం పట్టే ప్రయాణాన్ని 8 గంటల్లోనే తీసుకెళ్లే సూపర్ ఫాస్ట్ రైళ్లను తీసుకొస్తున్నాయి. ఈ వందేభారత్ ట్రైన్లను దేశమంతటా ముఖ్యమైన అన్ని రూట్లలో విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇలాంటి సమయంలో గమ్యస్థానాన్ని చేరేందుకు నాలుగు రోజుల పాటు ప్రయాణం చేసే వివేక్ ఎక్స్‌ప్రెస్ గురించి ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రస్తుతం వారానికి రెండు రోజులు నడుస్తున్న ఈ రైళ్లను మరింత విస్తరించాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది.

🚇 ఇండియన్‌ రైల్వే సర్వీసులో అత్యంత దూరం ప్రయాణం చేసే రైలు వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌. ఇది అస్సాంలోని డిబ్రుఘడ్‌ నుంచి తమిళనాడు కన్యాకుమారి మధ్య పరుగులు పెడుతుంటుంది. అది ప్రయాణించే దూరం 4,189 కిలో మీటర్లు. ఈ రైలు ప్రతి శనివారం డిబ్రుఘడ్‌ నుంచి మొదలై 80 గంటల పాటు ప్రయాణాన్ని సాగించి గమ్యానికి చేరుకుంటుంది.

🚇 ఈ రైలు మొత్తంగా ఎనిమిది రాష్ట్రాలను తాకుతూ ప్రయాణిస్తుంది. సుమారు 58 స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్ లో ఇంజిన్‌తో పాటు 3 జనరల్‌ కోచ్‌లు, 11 స్లీపర్ కోచ్‌లు, నాలుగు 3 టైర్‌ ఏసీ కోచ్‌లు, ఒక 2 టైర్‌ ఏసీ కోచ్‌, ఒక ప్యాంట్రీ ఉన్నాయి. 2011 నవంబర్ 19న ఈ రైలు సర్వీస్ ప్రారంభమైంది.

🚇 ప్రస్తుతం వివేక్ ఎక్స్‌ప్రెస్ వారానికి రెండు రోజులు మాత్రమే నడుస్తుంది. అది కూడా శని, ఆదివారాలు మాత్రమే. కానీ ఇప్పుడు వారానికి నాలుగు రోజులు ఈ ట్రైన్‌ను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. మంగళ, గురు వారాల్లో కూడా ఈ రైలును నడపనున్నారు. వివేక్ ఎక్స్‌ప్రెస్ 2023 మే 11 నుంచి వారానికి నాలుగు రోజులు నడవనుంది.

🚇 వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారికి వెళ్లేందుకు స్లీపర్ ధర రూ.1,185గా ఉంది. ఏసీ 3 కోచ్‌లో రూ.3,015, ఏసీ 2 కోచ్‌లో రూ.4,450గా ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IRCTC Train Ticket | జర్నీలోనే మీ స్లీపర్‌ టికెట్‌ను ఏసీ కోచ్‌లోకి మార్చుకోవాలా? ఇలా చేస్తే సరి !!

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?

Inavolu Mallanna Jatara | తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే జాతర ఐనవోలు.. దీని విశిష్ఠత ఏంటి? అన్నిటికంటే ఈ జాతర ఎందుకు ప్రత్యేకం?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News