Home Latest News Vande Bharat Metro | వందే భారత్ తరహాలో సరికొత్త మినీ రైళ్లు.. చిన్న పట్టణాలే...

Vande Bharat Metro | వందే భారత్ తరహాలో సరికొత్త మినీ రైళ్లు.. చిన్న పట్టణాలే టార్గెట్.. రైల్వే మంత్రి కీలక ప్రకటన

Vande Bharat Metro | పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాలకు వేగంగా వెళ్లేందుకు వందే భారత్ మినీ రైళ్లు రాబోతున్నాయి. ఉపాధి కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చి వెళ్లే వారిని దృష్టిలో పెట్టుకుని వందే భారత్ మెట్రో రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. రోజూ పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాలకు రాకపోకలు జరిపే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడించారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో రూ.2.42 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే లక్ష కోట్లు అధికంగా కేటాయించారు. ఈ క్రమంలో వందే భారత్ మినీ వర్షన్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. పెద్ద నగరాల చుట్టుపక్కల 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు పనికోసం నగరానికి వచ్చి మళ్లీ తమ స్వస్థలాలకు వేగంగా చేరుకునేందుకు ఈ వందే భారత్ మెట్రో రైళ్లను తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారని ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగానే పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. వందే మెట్రో రైళ్ల రూపకల్పన, తయారీ ఈ ఏడాదిలోనే పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైళ్ల ఉత్పత్తిని పెంచుతామని వెల్లడించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Breaking News | శ్రీకాకుళం జిల్లాలో డ్రోన్ కలకలం.. మత్స్యకారులకు చిక్కిన10 అడుగుల విమానం

Vizag | రాజు ఎక్కడుంటే.. రాజధాని అక్కడే.. మూడు రాజధానులపై ఏపీ మంత్రి అమర్‌నాథ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Nirmala Sitharaman | బడ్జెట్‌ ప్రసంగంలో టంగ్‌ స్లిప్‌ అయిన నిర్మలమ్మ.. సభలో విరబూసిన నవ్వులు

Tarakaratna | 45 నిమిషాలు గుండె ఆగడంతో తారకరత్న మెదడు వాచింది.. ఆరోగ్య పరిస్థితి వివరించిన విజయసాయిరెడ్డి

Andhra Pradesh Capital | ఏపీ సీఎం జగన్‌ కీలక ప్రకటన.. ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచిన విశాఖపట్నం

Exit mobile version