Thursday, March 28, 2024
- Advertisment -
HomeLatest NewsLock down | భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగితే లాక్‌డౌన్ విధిస్తారా ? ఎయిమ్స్...

Lock down | భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగితే లాక్‌డౌన్ విధిస్తారా ? ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ ఏమన్నారు ?

Lock down | టైం2న్యూస్, న్యూఢిల్లీ: చైనాలో కరోనా విజృంభన, భారత్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 వ్యాప్తి, లాక్‌డౌన్‌పై ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో కరోనా కేసులు విలయతాండవం చేస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు చేసింది. అయితే భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగితే పరిస్థితి ఏంటి? మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా? అన్న ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. దీనిపై గులేరియా స్పందించారు.

భారత్‌లో కరోనా అదుపులోనే ఉందని అన్నారు. అయితే వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు, లాక్‌డౌన్లు విధించాల్సిన అవసరం లేదన్నారు. భారత్‌లో అంత అవసరం కూడా రాదన్నారు. గతంలో విమానాలను నిషేధించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. చైనాలో విజృంభిస్తున్న బీఎఫ్.7 వైరస్‌ను భారత్‌‌లో నవంబర్‌లోనే గుర్తించారన్నారు. భారత్‌లో మెజారిటీ ప్రజలు వ్యాక్సిన్ వేసుకున్నారని అన్నారు. వ్యాక్సిన్‌తో పాటు ఇప్పటికే హైబ్రీడ్ ఇమ్యూనిటీ వచ్చేసిందన్నారు. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగిందని గులేరియా చెప్పారు. కాబట్టి ఆస్పత్రిలో చేరాల్సినంత సీరియస్ పరిస్థితి ఉండదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ ప్రస్తావనే అవసరం లేదన్నారు. అయితే కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వాళ్లకు ఆర్టీ పీసీఆర్ ( RT-PCR test ) పరీక్షలు తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణీకులకు పరీక్షలు తప్పనిసరి చేసింది. చైనా సహా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న దేశాల నుంచి వస్తున్న విమానాలపై మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Corona cases | చైనా తరహాలో భారత్‌లో కరోనా విజృంభిస్తుందా.. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Dubai lottery | దుబాయిలో రూ.33 కోట్ల లాటరీ గెలుచుకున్న జగిత్యాల యువకుడు.. డ్రైవర్‌గా వెళ్లి కోటీశ్వరుడయ్యాడు

Worlds Largest outbreak | ఒక్కరోజే 3.7 కోట్ల కరోనా కేసులు.. చైనాలోకల్లోలం సృష్టిస్తున్న కరోనా

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News