Home Latest News IAS vs IPS | నా పరువు పోయింది.. కోటి రూపాయలు ఇవ్వు.. ఐపీఎస్ రూపపై...

IAS vs IPS | నా పరువు పోయింది.. కోటి రూపాయలు ఇవ్వు.. ఐపీఎస్ రూపపై ఐఏఎస్ రోహిణి సింధూరి సీరియస్

IAS vs IPS | కర్ణాటక మహిళా అధికారిణుల మధ్య గొడవ రోజురోజుకీ మరింత ముదురుతోంది. ఫేస్‌బుక్‌లో ఇద్దరు మహిళా సివిల్ సర్వెంట్ల వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిపై వేటు వేసింది. అయినప్పటికీ వీళ్లు వెనక్కి తగ్గట్లేదు. తాజాగా ఐపీఎస్ రూపా మాడ్గిల్‌కు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి లీగల్ నోటీసు పంపించారు. తన పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి తన పరువు తీసినందుకు ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తనపై చేసిన ఆరోపణలకు గానూ నష్ట పరిహారం కింద రూ.కోటి చెల్లించాలని లీగల్ నోటీసులు పంపించారు.

తన క్లయింట్ ప్రస్తుత హోదాలో తన విధులను నిర్వహిస్తున్న సమయంలో ఫిబ్రవరి 18, 2023న ఫేస్ బుక్ పోస్ట్ చూసింది. ఆ ఫేస్ బుక్ పేజీ డీ రూపా మాడ్గిల్ పేరుతో ఉంది. ఇందులో తమ క్లయింట్ రోహిణిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మీరు చేసిన ఆరోపణలు నా క్లయింట్, ఆమె కుటుంబ సభ్యులను ఎంతో మానసిక వేదనకు గురి చేశాయి. వృత్తి పరంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా ఆమె ప్రతిష్టను దెబ్బతీశాయి. దీంతో ఆమె నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆమె నిజాయితీ, ప్రవర్తన చర్చనీయాంశంగా మారాయి. నా క్లయింట్ పేరు, ప్రతిష్టలకు జరిగిన నష్టాన్ని కరెన్సీ రూపంలో కొలవలేం. అయిన కానీ దీనిని కోటి రూపాయలకు పరిమితం చేస్తున్నాం. నష్ట పరిహారం కింద ఈ మొత్తాన్ని మీరు నా క్లయింట్ కు చెల్లించాలి అని రూపకు పంపిన నోటీసులో రోహిణి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

కర్ణాటక హస్త కళల అభివృద్ధి సంస్థకు రూపా మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. రోహిణి సింధూరి దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. అయితే మైసూరులో జిల్లా అధికారిగా ఐఏఎస్ రోహిణి పనిచేసినప్పుడు అప్పటి మంత్రి సారా మహేశ్‌ భార్య.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి భవంతి కడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రిపై దర్యాప్తునకు రోహిణి ఆదేశించింది. ఆ తర్వాత అది ప్రభుత్వ స్థలం కాదని.. నిబంధనల మేరకు మంత్రి భార్య బిల్డింగ్ కట్టినట్లు తేలింది. దీంతో తన తప్పును రోహిణి అంగీకరించింది.

తాజాగా జనతాదళ్ ఎమ్మెల్యే మహేశ్, మరో ఐఏఎస్ అధికారితో ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన పొటోను ఐపీఎస్ అధికారిణి రూప తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో పాటు రోహిణిపై పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. ఇవే ఫొటోలను ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేసింది. దీనిపై ఐఏఎస్ సింధూరి ఫైర్ అయ్యారు. త‌న‌పై వ్యక్తిగ‌తంగా, రూప త‌ప్పుడు ప్రచారం చేస్తోందని సింధూరి ఆరోపించింది. త‌న వాట్సాప్‌లోని స్క్రీన్‌షాట్లను తీసి, సోష‌ల్ మీడియాలో ఉన్న ఫోటోల‌ను తీసి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఫోటోలు పెడుతున్నారంటూ ఆమె ఆరోపించింది. వీళ్లిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీరియస్ అయిన కర్ణాటక ప్రభుత్వం ఇద్దరిపై వేటు విధించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Exit mobile version