Mukarram Jah | హైదరాబాద్ ( Hyderabad ) సంస్థానం ఎనిమిదో నిజాం, ఉస్మాన్ అలీ ఖాన్ ( Mir Osman Ali Khan ) మనుమడు నవాబు భర్కత్ అలీ ఖాన్ ముకరం ఝా కన్నుమూశారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. తన స్వగ్రామమైన హైదరాబాద్‌లో జరగాలన్నది ఆయన కోరిక. దీంతో ముకరం ఝా మృతదేహాన్ని టర్కీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఈ నెల 17న ముకరం ఝా భౌతిక కాయం హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఆయన పార్థివదేహాన్ని ముందుగా చౌమల్లా ప్యాలెస్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మక్కా మసీదులో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

1933లో జన్మించిన ముకరం ఝా.. డెహ్రాడూన్, లండన్‌లో చదువుకున్నాడు. ఈయన్ను 1954 జూన్ 14న హైదరాబాద్ చివరి ( ఏడో ) నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వారసుడిగా ప్రకటించారు. అప్పట్నుంచి హైదరాబాద్‌కు ఎనిమిదో రాజుగా గుర్తింపు పొందారు. 1971 వరకు ఆయన హైదరాబాద్ యువరాజుగా పిలిచారు. కానీ 1971లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని సంస్థానాలను రద్దు చేసింది. దీంతో టర్కీ వెళ్లి స్థిరపడ్డారు. 1980ల్లో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
CM KCR | టీచర్లకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక.. రెండు రోజుల్లో షెడ్యూల్
Nepal plane crash | నేపాల్ విమాన ప్రమాదంలో 42 మృతదేహాలు వెలికితీత.. మృతుల్లో ఐదుగురు భారతీయులు?
Ban on Gas stoves | చిన్న పిల్లల్లో పెరుగుతున్న అస్తమా.. గ్యాస్ స్టౌవ్ బ్యాన్ చేసే యోచనలో అమెరికా?