Home Latest News PM Modi | అది అవుట్ ఆఫ్ సిలబస్.. మీడియాను ఎలా మేనేజ్ చేస్తారని విద్యార్థి...

PM Modi | అది అవుట్ ఆఫ్ సిలబస్.. మీడియాను ఎలా మేనేజ్ చేస్తారని విద్యార్థి ప్రశ్నను ప్రధాని మోదీ రియాక్షన్ ఇదీ

Image Source: PMO India facebook

PM Modi | పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో శుక్రవారం ప్రధాన మంత్రి మోడీ పరీక్షా పే చర్చ నిర్వహించారు. ఎంతో ఓపిగ్గా విద్యార్థులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా జవహర్‌ నవోదయ స్కూల్‌ కి చెందిన అక్షర అనే విద్యార్థిని మోదీని ఓ ప్రశ్న అడిగింది. బహుభాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలని మోదీని అడిగింది. దీనికి ప్రధాని మోదీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కార్మికులు నివసించే బస్తీలో ఓ చిన్నారిని ఉదాహరణగా చెప్పారు.

ఓ బస్తీలోని ఎనిమిదేళ్ల చిన్నారి మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాల్‌, తమిళ్‌ మాట్లాడటం విని నేను చాలా ఆశ్చర్యపోయాను. అయితే ఆ చిన్నారికి అన్ని భాషలు ఎలా వచ్చాయని ఆరా తీశానని మోదీ చెప్పారు. అప్పుడు ఆ చిన్నారి ఇంటి పక్కన ఉండే ఒక్కో ఫ్యామిలీ.. ఒక్కో రాష్ట్రానికి చెందిన వారని… ఇలా ఎక్కడి నుంచో వచ్చిన వారు అందరూ ఒకే దగ్గర నివసించడం వల్ల ఆ చిన్నారి ఏక కాలంలో అనేక భాషలు నేర్చుకుందని తెలిపారు. బహు భాషల మీద పట్టు సాధించుకోవడం కోసం ప్రత్యేకంగా క్వాలిఫికేషన్స్‌ ఏమి అక్కర్లేదని… నేర్చుకోవాలనే తపన, పట్టుదల ఉంటే చాలని మోదీ ఆ విద్యార్థినికి సూచించారు.

ప్రతిపక్షాలు, మీడియా విమర్శలను ఎలా ఎదుర్కొంటారని మరో విద్యార్థి ప్రధాని మోదీని ప్రశ్నించారు. దీనికి ప్రధాని చమత్కారంగా సమాధానమిచ్చారు. ఈ ప్రశ్న అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పారు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. అనంతరం దీనికి సమాధానమిస్తూ.. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది ప్యూరిఫికేషన్ లాంటిది అని చెప్పారు. మీరు కష్టపడి పనిచేసే నిజాయితీపరులైతే విమర్శలను పట్టించుకోవద్దని సూచించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Job Notifications | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2391 కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TTD | అరచేతిలో వైకుంఠనాథుడి విశేషాలు.. మొబైల్‌లో ఒక్క క్లిక్‌తోనే శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు

Jamuna | టాలీవుడ్‌లో మరో విషాదం.. సినీ నటి జమున కన్నుమూత

Taraka Ratna | నందమూరి తారకరత్నకు గుండెపోటు.. లోకేశ్ యువగళం యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన టీడీపీ నేత

Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

Balakrishna | బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు వారసుల షాకింగ్ రెస్పాన్స్

Padma Awards | పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. చిన్న జీయర్‌ సహా 12 మంది తెలుగు వాళ్లకు పద్మ పురస్కారాలు

Exit mobile version