Friday, April 26, 2024
- Advertisment -
HomeNewsAPVande Bharat Express | సికింద్రాబాద్ టూ విశాఖ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ ధరలు,...

Vande Bharat Express | సికింద్రాబాద్ టూ విశాఖ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ ధరలు, టైం టేబుల్ వివరాలివే !!

Vande Bharat Express | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆదివారం నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు తీయనుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్‌ను రైల్వే శాఖ ఓపెన్ చేసింది. శనివారం నుంచి టికెట్లను అందుబాటులో ఉంచింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు టికెట్ ధరలను, ట్రైన్ టైం టేబుల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు ఏడు వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తుండగా… ఇది ఎనిమిదో రైలు. ఈ ట్రైన్ లోని ఏసీ,నాన్ ఏసీ బోగీలలో కలిపి మొత్తం 1,128 మంది ప్రయాణించవచ్చని తెలిపింది. వారంలో ఆరు రోజులు ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య పరుగులు పెడుతుంది. ఆదివారం ఈ రైలును ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌లో రైలును ప్రారంభించాల్సి ఉండగా పర్యటన వాయిదా పడింది. దీంతో వర్చువల్‌గా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Image Source: South Central Railway-S.C.R Facebook

టికెట్ ధరల విషయానికొస్తే.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో చెయిర్ కార్ ప్రయాణానికి ఒక్కో టికెట్ ధర 1,720 రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో బేస్ ఫేర్ 1,206 లు కాగా సూపర్ ఫాస్ట్ ఛార్జీల కింద 45, జీఎస్టీ 65, రిజర్వేషన్ చార్జీ 40. కేటరింగ్ 364 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణానికి ఒక్కో ప్రయాణికుడు 3,170 చెల్లించాలని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో బేస్ ఫేర్ రూ. 2,485 లు కాగా సూపర్ ఫాస్ట్ ఛార్జీల కింద 75, జీఎస్టీ 131, రిజర్వేషన్ ఛార్జీ 60, కేటరింగ్ కు 419 చొప్పున వసూలు చేయనున్నారు. అదే సికింద్రాబాద్ నుంచి బయల్దేరి వెళ్లే రైళ్లో మాత్రం ఛైర్ కార్ టికెట్ ధర రూ. 1,665గా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ. 3,120 గా నిర్ణయించారు. ఈ టికెట్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంది. కేటరింగ్‌కు సంబంధించిన చార్జీలు వేర్వేరుగా ఉండటంతో ఈ ధరల వ్యత్యాసం కనిపిస్తోంది.

విశాఖపట్నం టూ సికింద్రాబాద్

ఇక టైమింగ్స్ విషయానికొస్తే.. విశాఖపట్నం నుంచి ప్రతి రోజూ ఉదయం 5.55 గంటలకు వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 7.55 గంటలకు రాజమండ్రి, ఉదయం 10 గంటలకు విజయవాడ,ఉదయం 11 గంటలకు ఖమ్మం, మధ్యాహ్నం 12.05 గంటలకు వరంగల్, మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సికింద్రాబాద్ ఈ ట్రైన్ చేరుకుంటుంది .

సికింద్రాబాద్ టూ విశాఖపట్నం

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వరంగల్‌కు 4.35 గంటలకు, ఖమ్మంకు సాయంత్రం 17.45కు, విజయవాడకు రాత్రి 7 గంటలకు, రాజమండ్రికి రాత్రి 8.58 గంటలకు, విశాఖపట్నంకు రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుంది.

ఫుడ్ మెనూ ఇదే..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో టైంను బట్టి ఫుడ్ మెనూలో మార్పులు ఉంటాయి. ఉదయం టీ, టిఫిన్.. మధ్యాహ్నం భోజనం, రాత్రి పూట భోజనం అదించనున్నారు.

ఛైర్ కార్ చార్జీల వివరాలు ..

సికింద్రాబాద్ నుంచి వరంగల్ రూ. 520
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం రూ. 750
సికింద్రాబాద్ నుంచి విజయవాడ రూ. 905
సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి రూ. 1,365
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం రూ. 1,665

Image Source: South Central Railway-S.C.R Facebook

ఎగ్జిక్యూటీవ్ ఛార్జీలు

సికింద్రాబాద్ నుంచి వరంగల్ రూ. 1,005
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం రూ. 1,460
సికింద్రాబాద్ నుంచి విజయవాడ రూ. 1,775
సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి రూ. 2,485
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం రూ. 3,120

Image Source: South Central Railway-S.C.R Facebook

విశాఖ నుంచి ఛైర్ కార్ చార్జీలు

విశాఖపట్నం నుంచి రాజమండ్రి రూ. 625
విశాఖపట్నం నుంచి విజయవాడ రూ. 960
విశాఖపట్నం నుంచి ఖమ్మం రూ. 1,115
విశాఖపట్నం నుంచి వరంగల్ రూ. 1,310
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రూ. 1,720

ఎగ్జిక్యూటీవ్ ఛైర్ కార్ ధరలు

విశాఖపట్నం నుంచి రాజమండ్రి రూ. 1,215
విశాఖపట్నం నుంచి విజయవాడ రూ. 1,825
విశాఖపట్నం నుంచి ఖమ్మం రూ. 2,130
విశాఖపట్నం నుంచి వరంగల్ రూ. 2,540
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రూ. 3, 170

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Womens T20 World Cup | అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు వేళాయే.. తొలిపోరులో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీ .. జట్టులో భద్రాచలం అమ్మాయి

KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్‌ రాహుల్

India Vs New Zealand Tickets | ఉప్పల్‌ స్టేడియంలో 18న వన్డే మ్యాచ్.. టికెట్ల ధరలు ఎంత ? ఒక్కొక్కరు ఎన్ని టికెట్లు తీసుకోవచ్చు?

Prithvi Shaw | పృథ్వీ షాకు ప్రోత్సాహం సరే.. టీమిండియా జట్టులో చోటు మాటేంటి?

Rajashree Swain | ఇద్దరు క్రికెటర్లు మృతి.. అడవిలో అనుమానస్పదంగా మహిళా క్రికెటర్ మృతదేహం.. ఆత్మహత్యా ? హత్యా ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News