Home Latest News WPL Final 2023 | మహిళల మెగా వార్‌.. WPL ఫైనల్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీ...

WPL Final 2023 | మహిళల మెగా వార్‌.. WPL ఫైనల్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్‌ ఢీ

Image Source: Mumbai Indians twitter

WPL Final 2023 | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: దాదాపు నెలరోజులుగా అభిమానులను అలరిస్తున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ( WPL ‌) చివరి అంకానికి చేరుకుంది. ఫోర్లు, సిక్సర్ల జోరులో ముంచెత్తిన డబ్లూ్యపీఎల్‌ తొలి సీజన్‌ ఫైనల్‌ ఆదివారం జరగనుంది. లీగ్‌ దశలో టాప్‌లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో.. ఎలిమినేటర్‌ విజేత ముంబై ఇండియన్స్‌ తలపడనుంది.

సీజన్‌ ఆరంభం నుంచి నిలకడగా రాణించిన ఇరు జట్లే ఫైనల్‌ చేరగా.. సమ ఉజ్జీల పోరులో హోరాహోరీ సమరం ఖాయంగా కనిపిస్తున్నది. మహిళల క్రికెట్‌లో కొత్త ఒరవడి తీసుకురావాలనే లక్ష్యంతో భారత క్రికెట్‌ నియంత్రణా మండలి ( BCCI ) ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ లీగ్‌ తొలి సీజన్‌ అంచనాలకు మించి ఆకట్టుకుంది. అభిమానులు మైదానాలను ముంచెత్తగా.. ఏదో సప్పగా సాగుతాయనుకున్న మ్యాచ్‌లు అదిరిపోయే ట్విస్ట్‌లతో అలరించాయి.

అమ్మాయిల మ్యాచ్‌లో రెండొందల పరుగులు సాధ్యమా అనుకుంటే.. ఈ లీగ్‌లో ఆ ఫీట్‌ చాలాసార్లు నమోదైంది. అమ్మాయిల్లో పోటీతత్వం పెంచిన ఈ లీగ్‌ ద్వారా ఎందరో వర్ధమాన క్రీడాకారిణులు వెలుగులోకి రాగా.. ఆటను కెరీర్‌గా తీసుకోవాలనుకుంటున్న అమ్మాయిల సంఖ్య లక్షల్లోకి చేరింది. సీజన్‌ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లే ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇరు జట్లు గ్రూప్‌ దశలో ఎనిమిది మ్యాచ్‌లాడి ఆరింట నెగ్గాయి.

అయితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించగా.. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ పోరులో యూపీ వారియర్స్‌ను చిత్తు చేయడం ద్వారా ముంబై ఇండియన్స్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. పేపర్‌ మీద చూసుకుంటే ఇరు జట్లు సమంగానే కనిపిస్తున్నా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమతూకంగా ఉంటే.. టాపార్డర్‌ దుమ్మురేపుతుండటం ఢిల్లీకి కలిసి రానుంది.

హర్మన్‌తో పాటు యస్తిక, హీలీ మాథ్యూస్‌, స్కీవర్‌ బ్రంట్‌, అమెలియా కెర్ర్‌, పూజ వస్త్రాకర్‌, ఇస్సి వాంగ్‌, సైకా ఇషాఖ్‌తో ముంబై పటిష్టంగా కనిపిస్తున్నది. మరోవైపు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌తో పాటు విధ్వంసక ఓపెనర్‌ షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, మరినె కాప్‌, కాప్సీ, జాన్సెన్‌తో ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ శత్రుదుర్భేద్యంగా ఉంది. మరి ఒత్తిడిని అధిగమిస్తూ.. డబ్లూ్యపీఎల్‌ టైటిల్‌ ఎవరు చేజిక్కించుకుంటారో చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pakistan vs Afghanistan | పాకిస్థాన్‌కు అఫ్గానిస్థాన్‌ షాక్‌.. తొలిసారి టీ20 మ్యాచ్‌లో గెలుపు

Rahul Gandhi | సారీ చెప్పేందుకు సావర్కర్‌ని కాదు.. ఎంపీగా అనర్హత వేటుపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి షాక్.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు

Sircilla | రివార్డులు వస్తాయని ఆశపడి.. లక్షన్నర పోగొట్టుకున్న సిరిసిల్ల యువతి

Rains | తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్‌.. రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

AP MLC Elections | టీడీపీకి క్రాస్‌ ఓటింగ్‌ వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ నలుగురేనా.. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు ?

Exit mobile version